KTR Tweet Viral: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్ ట్విటర్ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వం పై ఫైర్ అయ్యారు. సీపీఎస్ రద్దు చేసి..ఓల్డ్ పెన్షన్ స్కీం తిరిగి తెస్తామని మాటిచ్చి..ఇప్పుడు బెల్లం కొట్టిన రాయిలా కూర్చుంటే ఎట్లా? అని కేటీఆర్ మండిపడ్డారు. అన్ని రంగాల్లో వైఫల్యం..అన్ని వర్గాల్లో ఆగ్రహం వ్యక్తమవుతున్నాయని తెలిపారు. సకల జనులను దగా చేసింది కాంగ్రెస్ సర్కారు అని పేర్కొన్నారు. ఉద్యోగులు.. నిరుద్యోగులు.. విద్యార్థులు.. రైతులు.. కార్మికులు.. మహిళలు సమాజంలోని ప్రతి సెక్షన్ ఆందోళన బాటలోనే వున్నారని తెలిపారు. ఐదు డీఏలు పెండింగ్‌లో వుంచడం ఏంటి.. ఇంత అన్యాయం ఎప్పుడైనా వుందా? అని ప్రశ్నించారు. కనీసం కలిసి మాట్లాడటానికి అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వకుండా ఉద్యోగ సంఘాలను అవమానించడం భావ్యమా? విన్నపాలు వినే తీరికకూడా లేదా ఈ ముఖ్యమంత్రికి? అని మండిపడ్డారు.
Read also: Etela Rajender: ఇందిరా పార్క్ వద్ద ధర్నాలో పాల్గొనండి.. మూసీ బాధితులకు ఈటెల పిలుపు..
కొత్త పీఆర్‌సీ వేసి ఆరు నెలల్లోనే సిఫారసులు అమలు చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించింది వాస్తవం కాదా? 11 నెలలు గడిచినా రెండో PRC నివేదికను ఎందుకు తెప్పించుకోలేదు? అన్నారు. సీపీఎస్ రద్దు చేసి..ఓల్డ్ పెన్షన్ స్కీం తిరిగి తెస్తామని మాటిచ్చి..ఇప్పుడు బెల్లం కొట్టిన రాయిలా కూర్చుంటే ఎట్లా? అన్నారు. తెలంగాణ ఉద్యమంలో..స్వరాష్ట్ర ప్రగతిలో కీలక భూమిక పోషించిన ఉద్యోగ వర్గాల సమస్యలను పట్టించుకోకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ అహంకారానికి నిదర్శనం..! అన్నారు. నెలల తరబడి జీతాల్లేక చిరుద్యోగులు…కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ సిబ్బంది అల్లాడిపోతున్నారు..! అన్నారు. ఆశాలు..అంగన్ వాడీలకు ఇచ్చిన హామీలకు దిక్కుమొక్కు లేదు..! అని ఆవేదన వ్యక్తం చేశారు. ఏఈవోల పనిభారం బాధ.. ఆవేదన వినకుండా వందల మందిని ఏకపక్షంగా సస్పెండ్ చేయడం దుర్మార్గం..! అన్నారు. ఉద్యోగుల మీద కక్ష కట్టడం మంచిది కాదు..వాళ్ల సమస్యల పరిష్కారం మీద దృష్టి పెట్టండి..! అని ప్రభుత్వానికి సూచించారు.
Bandi Sanjay: జాలేస్తోంది..? కేటీఆర్ లీగల్ నోటీసుపై బండి సంజయ్ స్పందన..