Bandi Sanjay: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. నన్ను రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేక.. లీగల్ నోటీస్ ఇవ్వడం చూస్తుంటే జాలేస్తోందని కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీమంత్రి కేటీఆర్ నాకు లీగల్ నోటీసు పంపినట్లు మీడియాలో చూశానని తెలిపారు. లీగల్ నోటీసుతో భయపెట్టాలని చూస్తే ఇక్కడ భయపడే వారెవరూ లేరని అన్నారు. నన్ను రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేక లీగల్ నోటీస్ ఇవ్వడం చూస్తుంటే జాలేస్తోందన్నారు.
Read also: Health Benefits: ఈ విషయం తెలిస్తే.. ఇప్పుడే తాగడం మొదలెట్టేస్తారు!
తాటాకు చప్పళ్లకు భయపడేది లేదన్నారు. నాపై తొలుత వ్యక్తిగత ఆరోపణలు చేసి అవమానించింది కేటీఆరే.. అన్నారు. అందుకు బదులుగానే నేను మాట్లాడిన అన్నారు. ఆయన సుద్దపూస అనుకుంటున్నాడేమో అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన భాగోతం ప్రజలకు తెలుసని అన్నారు. ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్ కేసు వ్యవహారంలో ఏం జరిగిందో, ఆ కేసులను ఏ విధంగా నీరుగార్చారో తెలుసని అన్నారు. ఇప్పటి వరకు మాటకు మాటతోనే బదులిచ్చిన అన్నారు. లీగల్ నోటీసులకు నోటీసులతోనే బదులిస్తా. మేం చట్టాన్ని, న్యాయాన్ని గౌరవించే వ్యక్తులం అన్నారు. చట్టం, న్యాయం ప్రకారం కూడా ముందుకు వెళతామని తెలిపారు.
Read also: Sangareddy Crime: నా భర్త చివరి కోరిక మేరకే అంత్యక్రియలు ఆపాను: మృతుడి భార్య..
కేటీఆర్ నోటీసులు..
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. కేంద్ర మంత్రి బండి సంజయ్ కు లీగల్ నోటీలసులు పంపారు. తనపై నిరాధారమైన, తన పరువుకు నష్టం కలిగేంచేలా వ్యాఖ్యలు చేశారంటూ టీసులు పంపారు. తనపై చేసిన నిరాధారమైన వ్యాఖ్యలకు వారం రోజుల్లోగా బేషరతుగా క్షమాపణలు చెప్పకపోతే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. ఈ నెల 19 వ తేదీన బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ తనపై తప్పుడు ఆరోపణలు చేశారని కేటీఆర్ నోటీసులో పేర్కొన్నారు. కేటీఆర్ డ్రగ్స్ తీసుకుంటాడని, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డాడని బండి సంజయ్ ఆరోపణలు చేశారు. దీనిపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ బండి సంజయ్ చేసిన నిరాధరమైన కామెంట్లను నోటీసులో పేర్కొన్నారు. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు తన వ్యక్తిత్వాన్ని అవమానపరిచేలా, ప్రతిష్టను దిగజార్చేలా ఉన్నాయని నోటీసులో తెలిపారు.
KTR Legal Notice: వారం రోజుల్లో క్షమాపణలు చెప్పాలి.. బండి సంజయ్ కి కేటీఆర్ లీగల్ నోటీసు..