Etela Rajender: ఈనెల 25న ఇందిరా పార్క్ వద్ద ధర్నాకు మూసీ బాధిత కుటుంబాలు తరలిరావాలని ఎంపీ ఈటెల రాజేందర్ పిలుపునిచ్చారు. ఉప్పల్ నియోజక వర్గంలోని మూసి పరివాహక ప్రాంతం అయిన రామంతపూర్ లోని కేసీఆర్ నగర్, బాలకృష్ణ నగర్, సాయికృష్ణ నగర్ ప్రాంతాల ఈటెల రాజేందర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఈటెల మాట్లాడుతూ… తెలంగాణ ప్రజలు కేసీఆర్ పై విసిగిపోయి, కాంగ్రెస్ ఆశ చూపే హామీలు విని కాంగ్రెస్ ని పట్టం కట్టి గెలిపించారని తెలిపారు. కాంగ్రెస్ ని గెలిపించిన పాపానికి గత రెండు మూడు నెలలుగా చెరువుల వద్ద, మూసి పరివాహక ప్రాంతం వద్ద గత ముప్పై ఎండ్లకు పైగా ఇంటి నిర్మాణాలు చేపట్టి నివసిస్తున్న కుటుంబాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని మండిపడ్డారు. శనివారం, ఆదివారం వస్తే చాలు ఈ ప్రాంత ప్రజలు నిద్రలేకుండా భయబ్రాంతులకు గురిచేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని ఆరోపించారు.
Read also: Bandi Sanjay: జాలేస్తోంది..? కేటీఆర్ లీగల్ నోటీసుపై బండి సంజయ్ స్పందన..
ఈ ప్రాంత ప్రజల శవాల మీద నడుచుకుంటూ వెళ్లి ఇమాక్స్ లాంటి నిర్మాణాలు చేపట్టుకోవాల్సి వస్తుంది కానీ మా గొంతులో ప్రాణం ఉండగా ఇక్కడి ఇండ్లను కూల్చనీయము ఇక్కడి ప్రజలు చెప్తున్నారని అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం సామాన్య ప్రజానీకం పైన దౌర్జన్యం కొనసాగిస్తున్నారని అన్నారు. బీజేపీ పార్టీ ఈ పేదలకు అండగా ఉంటుంది… ఇండ్లను కులగొట్టలనీ ప్రయత్నిస్తే కబర్దార్ అని వార్నింగ్ ఇచ్చారు. పార్టీ పరంగా నేడు, రేపు మూసి పరివాహక ప్రాంతం ప్రజలను ఇండ్లను సందర్శించి, వారి మాటలను ప్రతిబింబించే విధంగా 25న ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేస్తామన్నారు. మాకోసం చేస్తున్న ధర్నాకు వంద శాతం హాజరు అవుతాము అని ఇక్కడి ప్రజలు చెప్తున్నారని తెలిపారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలి, కానీ సుందరీకరణ పేరుతో కూల్చే ప్రయత్నం చేయొద్దు అన్నారు. ఆనాడు నిజాం ప్రభుత్వం చేపట్టిన పనులు చేపట్టి, మూసి సుందరీకరణ చేపట్టాలన్నారు ఈటెల. ఈ కార్యక్రమంలో బీజేపీ శ్రేణులు, మూసి పరివాహక ప్రాంతం బాధితులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Sangareddy Crime: నా భర్త చివరి కోరిక మేరకే అంత్యక్రియలు ఆపాను: మృతుడి భార్య..