KTR: బీఆర్ఎస్ శ్రేణులు, కార్యకర్తలు ఉప ఎన్నికలకు రెడీగా ఉండాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు ఎక్స్(ట్విటర్) వేదికగా ట్వీట్ చేశారు. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులు చూస్తుంటే పార్టీ మారిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల పైనా వేటు పడుతుందన్నారు.
ఇవాళ ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారం అనర్హత పిటిషన్లపై విచారణ చేయనున్నారు. ఈ సందర్భంగా అమరావతికి నెల్లూరు వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు చేరుకున్నాయి. అనర్హత పిటిషన్ పై స్పీకర్ తో విచారణకు హాజరయ్యే అంశంపై వైసీపీ రెబెల్స్ తర్జన భర్జన పడుతున్నారు.