Kaleshwaram Investigation: కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఏడుగురు సీఈ స్థాయి ఇంజనీర్లు ఈరోజు కమిషన్ ఎదుట హాజరుకానున్నారు. కమిషన్ పబ్లిక్ హియరింగ్‌కు రీసెర్చ్ ఇంజనీర్లు, అడ్మినిస్ట్రేటివ్ అధికారులు హాజరవుతారు. గత నెలలో కమిషన్ 15 మందికి పైగా విచారణ జరిపింది. ఇవాల్టికి చెందిన 25 మందికి పైగా కమీషనర్ జస్టిస్ పీనాకి చంద్రఘోష్ విచారించనున్నట్లు తెలుస్తోంది. ఎన్‌డిఎస్‌ఎ, పుణె నివేదిక కోసం లేఖలు రాసిన కమిషన్‌కు అవసరమైన సమాచారాన్ని అందజేస్తామని ఆయా బృందాలు తెలిపాయి. కమిషన్ కోరిన న్యాయవాదిని అందించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. అఫిడవిట్ దాఖలు చేసిన ప్రతి ఒక్కరిపై కమిషన్ బహిరంగ విచారణ జరుపుతుంది. ఇకపోతే.. కమిషనర్ జస్టిస్ పీనాకి చంద్రఘోష్ ఇప్పటికే కమిషన్ విచారణ కార్యాలయానికి చేరుకున్నారు. నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా ఘోష్‌తో సమావేశమయ్యారు. నేటి నుంచి ఎవరిని విచారించాలి, విజిలెన్స్, ఎన్డీఎస్ఏ నివేదికలపై చర్చించారు. ఇప్పటికే ఓపెన్ కోర్టు విచారణ ప్రారంభమైంది. గత 20 నుంచి ఐదు రోజులుగా ఇరిగేషన్ అధికారులను, సీఈవోను జస్టిస్ ఘోష్ విచారించారు.
Telangana Cabinet: సీఎం రేవంత్ అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ భేటి.. కీలక అంశాలు ఇవే..