Rs.100 Crore Land Scam: మెట్టులో రూ. 100 కోట్ల విలువైన లక్ష గజాల భూమి అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. స్థానిక ప్రజా ప్రతినిధులు, బ్యాంకు ఉద్యోగి సహా పలువురి పేర్లపై ఈ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. నకిలీ ఆర్డీవో ప్రొసీడింగ్ ద్వారా అబ్దుల్లాపూర్ మెట్టు సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగింది. బాట సింగారం రెవెన్యూ పరిధి 376లో 223 ఎకరాల్లో శ్రీమిత్ర డెవలపర్స్ భారీ వెంచర్ నిర్మాణం చేపట్టింది. శ్రీమిత్ర డెవలపర్స్ ప్రజా ప్రయోజనార్ధం వదిలి వేసిన లక్ష గజాల భూమిని స్థానిక లీడర్లు మింగేశారు.
Read Also: Shehbaz Sharif: నేటినుంచి 5 రోజులు అమెరికాలో పాక్ ప్రధాని పర్యటన.. ట్రంప్‌ను కలవనున్న షెహబాజ్ షరీఫ్
అయితే, నకిలీ ఆర్డీవో ప్రొసీడింగ్ తో శ్రీమిత్ర డెవలపర్స్ డైరెక్టర్ దశరథ రామయ్య ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. నకిలీ RDO ప్రొసీడింగ్ అని తేల్చిన అబ్దుల్లాపూర్ మెట్టు రెవెన్యూ అధికారులు.. దీనిపై అబ్దుల్లాపూర్ మెట్టు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఇక, శ్రీమిత్ర డెవలపర్స్ డైరెక్టర్ దశరథ రామయ్యపై కేసు నమోదు అయింది. అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకున్న స్థానిక ప్రజా ప్రతినిధులు, బ్యాంకు ఉద్యోగిగా పోలీసులు గుర్తించారు. ఈ అంశంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, విచారణ చేపట్టారు.