Siddipet Crime: సిద్దిపేట జిల్లాలో దారుణం జరిగింది. ఏడో తరగతి బాలికపై ఓ యువకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన కొమురవెల్లి మండలం గురువన్నపేటలో చోటుచేసుకుంది. శుక్రవారం రోజు ఇంట్లో ఉన్న బాలికపై ఇంటి పక్కన ఉండే యువకుడు లైంగిక దాడి చేశాడు. బాలికకి కడుపునొప్పి రావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లగా విషయం బయటకు వచ్చింది. బాలికను కుటుంబ సభ్యులు ప్రశ్నించగా.. అసలు విషయం చెప్పడంతో ఆగ్రహించిన కుటుంబ సభ్యులు, గ్రామస్తులు యువకుడి ఇంటి వద్దకు భారీగా చేరుకున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న యవకుడు, కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో యువకతి కుటుంబ సభ్యులు కోపంతో నిందితుని ఇంటిని పెట్రోల్ పోసి తగలపెట్టారు. అంతేకాకుండా అక్కడే వున్న కారు, జేసీబీని ధ్వంసం చేశారు. గ్రామస్తుల దాడిలో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆందోళన కారులు చెదరగొట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పరారీలో వున్న యుకువడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. బాలికపై లైంగిక దాడి చేసిన యువకుడితో ముందే పరిచయం వుందా? బాలికను ట్రాప్ చేసి ఆమెపై లైంగిక దాడి చేశాడా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. యువకుడితో పాటు కుటుంబ సభ్యులు కూడా పరారీలో ఉండటంతో పోలీసులకు ఈ ఘటన సవాల్ గా మారింది.
Danam Nagender: పేదలపై కాదు.. ఐమాక్స్, జలవిహార్ ఉన్నాయి.. హైడ్రాపై దానం కీలక వ్యాఖ్యలు