GHMC Mayor: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గద్వాల విజయలక్ష్మీకి ఫోన్లో వేధింపులు. అర్ధరాత్రి ఫోన్లు చేస్తూ ఓ ఆగంతకుడు బెదిరింపులకు పాల్పడుడుతున్నాడు. మేయర్ తో పాటు ఆమె తండ్రి కే కేశవరావు అంతు చూస్తానంటూ బెదిరింపులు దిగుతున్నాడు. మిడ్ నైట్ లో కాల్స్ తో పాటు వాయిస్ మెసేజ్ లు చేసి బెదిరించిన దుండగుడు. బోరబండలో చనిపోయిన సర్దార్ కి సంబంధించిన వ్యక్తిగా సదరు వ్యక్తి చెప్పుకొచ్చాడు.
Read Also: Minister Uttam: కాళేశ్వరం వైఫల్యానికి ప్రధాన కారణం కేసీఆర్, హరీష్ రావులే..
అయితే, అసభ్యకరమైన పదజాలంతో బెదిరింపులకు పాల్పడుతున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన మేయర్ గద్వాల విజయలక్ష్మీ పీఆర్ఓ. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు.. ఆగంతకుడు ఆచూకీ కోసం దర్యాప్తు చేస్తున్నారు.