Bandla Krishna Mohan Reddy: తెలంగాణలో రాజకీయం మరోసారి ఆసక్తికరంగా మారింది. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాసేపటి క్రితం సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. జూబ్లీహిల్స్ నివాసంలో మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. బండ్ల కృష్ణమోహన్ రెడ్డితోపాటు ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, అడ్లూరి లక్ష్మణ్, మధుసూదన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, తదితరులు ఉన్నారు. అయితే.. నిన్న ఎమ్మెల్యే బండ్లతో మంత్రి జూపల్లి చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. కాగా, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ మళ్లీ కాంగ్రెస్‌లో చేరుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన సీఎం రేవంత్‌ను కలిశారు. అయితే తాజాగా తాను మళ్లీ బీఆర్‌ఎస్‌లో చేరతానని బండ్ల వ్యాఖ్యలు చేశారు. దీంతో రంగంలోకి దిగిన మంత్రి జూపల్లి… బండ్ల కృష్ణమోహన్ తో చర్చలు జరిపారు. దీంతో ఆయన మళ్లీ హస్తం పార్టీలోకి వస్తున్నట్లు సమాచారం.
Read also: Dog Attack: నిద్రిస్తున్న వృద్ధురాలిపై కుక్కల దాడి.. చెల్లాచెదురుగా శరీర భాగాలు..
నిన్న మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతారని వెల్లడించిన విషయం తెలిసిందే.. నియోజకవర్గ అభివృద్ధి నిరంతర ప్రక్రియ కొనసాగుతుందని అన్నారు. గద్వాల రైతాంగానికి అన్ని విధాల ఆదుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైందన్నారు. ఎమ్మెల్యే అనుచరులపై కేసులు.. సమాచారం లోపంతో ఏదైనా పొరపాట్లు జరిగితే వాటిని సరిదిద్దుతామన్నారు. కృష్ణమోహన్ రెడ్డికి బీఆర్ఎస్ నాయకులతో ఉన్న అనుబంధం నేపథ్యంలోనే మాజీ మంత్రి కేటీఆర్ ను గానీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను గాని కలిశారని క్లారిటీ ఇచ్చారు. అయితే మీడియాతో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడేందుకు నిరాకరించారు. జూపల్లితో పాటే హైదరాబాద్ కు గద్వాల ఎమ్మెల్యే బయలుదేరారు. కాగా.. గద్వాల బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి జూలై 6న హస్తం గూటికి చేరిన విషయం తెలిసిందే.
Nagar Kurnool Crime: దారుణం.. భార్యను ఇనుప రాడ్డుతో కొట్టి హత్య చేసిన భర్త..