TS Assembly: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ కుమార్ ఎన్నికయ్యారు. స్పీకర్ ఎన్నికకు సభ్యులెవరూ నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో ఎన్నిక ఏకగ్రీవమైన సంగతి తెలిసిందే. గురువారం శాసనసభ ప్రారంభమైన అనంతరం స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ తెలిపారు. ఈ సందర్భంగా స్పీకర్‌గా నియమితులైన గడ్డం ప్రసాద్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామారావు, అన్ని పార్టీల సభ్యులు అభినందనలు తెలిపారు. అనంతరం ప్రొటెం స్పీకర్ ప్రసాద్‌తో ప్రమాణం చేయించారు. స్పీకర్ ఎన్నికకు సహకరించిన అన్ని పార్టీలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఆయనే స్వయం వెళ్లి గడ్డం ప్రసాద్ ను స్పీకర్ ఛైర్ లో కూర్చోబెట్టారు. ఏకగ్రీవ ఎన్నికకు అన్ని పార్టీలు మద్దతిచ్చాయన్నారు. అసెంబ్లీ స్పీకర్‌గా వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ ఎన్నికయ్యారు. ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ ఆయనతో ప్రమాణం చేయించారు. అనంతరం సీఎం సహా ఇతర సభ్యులు ఆయనకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. అసెంబ్లీ మంచి సంప్రదాయానికి నాంది పలికిందన్నారు. భవిష్యత్తులోనూ ఇదే సంప్రదాయాన్ని కొనసాగించాలన్నారు.
Read also: Smriti Irani : మహిళలకు వేతనంతో కూడిన పీరియడ్ లీవ్ ఇవ్వకూడదు : స్మృతి ఇరానీ
ఈ సందర్భంగా సభలో స్పీకర్‌కు ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడిన మంత్రులు స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను సభకు తెలియజేశారు. తొలుత స్పీకర్‌గా ఎన్నికైన గడ్డం ప్రసాద్‌ను అభినందించారు. స్పీకర్‌గా ఎన్నికైన గడ్డం ప్రసాద్‌కుమార్‌ను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అభినందించారు. పేదల సమస్యలు తెలిసిన ప్రసాద్ కుమార్ అన్నారు. రాష్ట్ర సమస్యలపై పెద్దఎత్తున చర్చించేందుకు సభ్యులకు మరింత సమయం ఇస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. శాసనసభలో జరిగే చర్చలు అర్థవంతంగా ఉంటాయన్న నమ్మకం ఉందన్నారు. శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. అంచెలంచెలుగా ఎదిగి నేడు స్పీకర్ గా ఎన్నికైన గడ్డం ప్రసాద్ కుమార్ కు అభినందనలు తెలిపారు. శాసనసభలో మంచి సంప్రదాయాన్ని నెలకొల్పుతారని స్పీకర్‌పై పూర్తి విశ్వాసం ఉందన్నారు. స్పీకర్‌కు మద్దతు తెలిపిన ప్రతిపక్షాలకు ధన్యవాదాలు తెలిపారు. స్పీకర్ నిర్ణయాలకు పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. తన తండ్రి శ్రీపాదరావు కూడా అదే శాసనసభలో పనిచేసి ఆ పీఠాన్ని ఎక్కించారని మంత్రి శ్రీధర్ బాబు గుర్తు చేశారు.
Jigarthanda Double X: ఇండియన్ సినిమాని చూడబోతున్న హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్