Kalasa Movie: ‘కలశ’ ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్.. మీడియాపై మురళీ మోహన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చంద్రజ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై బిగ్‌బాస్ ఫేమ్ భానుశ్రీ, సోనాక్షి వర్మ, అనురాగ్ కీలక పాత్రల్లో నటించిన ‘కలశ’ డిసెంబర్ 15న ప్రేక్షకుల ముందుకి రానుంది. కొండ రాంబాబు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజ వాడవల్లి నిర్మించగా ప్రీ రిలీజ్ ప్రెస్మీట్ ఫిలింఛాంబర్ లో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో ‘‘ఓ చిట్టీ తల్లి’’ సాంగ్ ను ముఖ్య అతిథులుగా విచ్చేసిన సీనియర్ నటులు మురళీ మోహన్ ఆవిష్కరించగా కలశ టైటిల్సాంగ్ ను దర్శకులు వీర శంకర్ విడుదల చేశారు. ఈ క్రమంలో మురళీ మోహన్ మాట్లాడుతూ దర్శకుడు రాంబాబు దర్శకత్వంలో నేను కొన్ని సీరియల్స్ చేశా, మంచి పర్‌ఫెక్షనిస్ట్. దాసరి నారాయణరావు అసిస్టెంట్ డైరెక్టర్‌లకు సీన్‌లకు సంబంధించిన వివరాలు డైలాగ్‌లు చెపుతుంటే టేపు రికార్డర్‌లో రికార్డు చేసుకునేవారు, ఆ తర్వాత వాటిని నీట్ చేసి రాసుకొస్తే.. చిత్రీకరణ సమయంలో వాటిలో కొన్ని డైలాగ్‌లు కొట్టేసేవారు. ఎందుకంటే అవి ఈ సీన్‌కు అంత అవసరం లేదు అనేవారు, అలాగే ఈ రాంబాబు కూడా మంచి రచయిత, ఏది కావాలో అదే తీస్తాడు. తద్వారా నిర్మాతకు లాభం అని అన్నారు.
Also Read: Kalki 2898 AD : కల్కిలో ప్రభాస్ మూడు పాత్రలు ఇవేనా ..?
Also Read
- Matsya: పడవ కింద నుంచి వెళ్లిన 'మిథికల్ ఫిష్'.. టాలీవుడ్లో మరో గ్రాండ్ విజువల్ వండర్ 'మత్స్య'!
- Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
- Varanasi Update: 'వారణాసి'లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
- world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. 'భోగి' టీజర్ రిలీజ్
ఈ సినిమా గురించి విన్నాను. మంచి థ్రిల్లర్ సబ్జెక్ట్, థ్రిల్లర్ అంటే రాతకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో.. తీత అంటే కెమెరా వర్క్‌కు కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది, అలాగే సంగీతానికి కూడా. వీటి విషయంలో దర్శక, నిర్మాతలు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు అని పోస్టర్స్ చూస్తుంటే తెలుస్తోంది. నిర్మాత రాజేశ్వరి గారు ఈ చిత్రం పట్ల చూపించిన శ్రద్ధ ట్రైలర్ చూస్తుంటేనే అర్ధమౌతోంది. ఈ సినిమా చక్కటి విజయం సాధించి అందరికీ మంచి పేరు తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నా. నేను ఓ చిన్న సినిమాకు సంబంధించి బెంగుళూరులో ప్రెస్‌మీట్‌కు అటెండ్ అయ్యా, అక్కడ కేవలం రెండో, మూడో కెమెరాలు, ఓ నలుగురు జర్నలిస్ట్‌లు మాత్రమే హాజరయ్యారు. వారు కూడా కాలుమీద కాలు వేసుకుని మనం చెప్పేది రాసుకోవడం కూడా లేదు. కానీ మన తెలుగు సినీ మీడియా అలా కాదు. సినిమా చిన్నదైనా.. పెద్దదైనా దానికి మంచి ప్రమోషన్ ఇస్తారు. అందుకు ఉదాహరణగా ఇక్కడున్న ఇన్ని కెమెరాలను, ఇంతమంది జర్నలిస్ట్‌లను చూస్తుంటే తెలుస్తుంది, తెలుగు సినీ మీడియాకు నా ధన్యవాదాలన్నారు.
దర్శకుడు వీరశంకర్ మాట్లాడుతూ…
ఈ ‘‘చిట్టితల్లి’’ పాట చాలా ఎమోషనల్‌గా ఉందనీ ప్రేక్షకులకు ఖచ్చితంగా కనెక్ట్ అయ్యేసాంగ్ అని అన్నారు. ఈ పాటే కాదు సినిమా కంటెంట్ కూడా చాలా బాగుందన్న ఆయన దర్శకుడు రాంబాబు ఈ లైన్ చెప్పినప్పుడు హిట్ మూవీ తీస్తున్నారనీ అనిపించింది. ఇలాంటి సైలకాజికల్ థ్రిల్లర్‌ను తెరకెక్కించాలంటే కత్తిమీద సాము లాంటింది, నిర్మాత సహకారం చాలా ముఖ్యం అన్నారు.
తాజావార్తలు
-
Matsya: పడవ కింద నుంచి వెళ్లిన ‘మిథికల్ ఫిష్’.. టాలీవుడ్లో మరో గ్రాండ్ విజువల్ వండర్ ‘మత్స్య’!
-
IndiGo : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
-
CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
-
Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
-
Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!