తెలంగాణలో అర్ధరాత్రి నుంచే ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆరోగ్య సేవలు నిలిచిపోయాయి. ప్రభుత్వం నెలకు వంద కోట్ల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చినా పట్టువీడని నెట్ వర్క్ ఆస్పత్రులు.. నెలకు కనీసం 500 కోట్లు విడుదల చేయాలని పట్టుబడుతున్న నెట్ వర్క్ ఆస్పత్రుల అసోసియేషన్.. సమ్మెపై వెనక్కి తగ్గేది లేదని నెట్ వర్క్ ఆస్పత్రుల అసోసియేషన్ ప్రెసిడెంట్ వద్దిరాజు రాకేష్ తెలిపారు. ఆరోగ్యశ్రీ సేవలు యథావిధిగా కొనసాగించాలని ప్రైవేట్ హాస్పిటళ్ల యాజమాన్యాలకు ఆరోగ్యశ్రీ సీఈవో ఉదయ్ కుమార్ కోరారు.…
Aarogyasri: ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేయాలనే ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆరోగ్యశ్రీ సీఈవో ఉదయ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్య సేవలను మెరుగుపరచడానికి అనేక చర్యలు తీసుకున్నట్లు ఆయన గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా, గతంలో రూ. 5 లక్షలుగా ఉన్న ఉచిత…
ఎటువంటి మందులు లేకుండా పలు రకాల అనారోగ్య సమస్యలను తీర్చేందుకు చక్రసిద్ధ వైద్య నిపుణులు డాక్టర్ సత్య సింధుజ గారి నేతృత్వంలో వైద్యం అందించేందుకుగాను నైపుణ్యం కలిగిన ప్రత్యేక డాక్టర్లు మరియు సిబ్బంది బృందం గుండెపుడి గ్రామంలో ఉచితంగా ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఈనెల 14వ తేదీ నుండి నిర్వహిస్తున్నారు. పలు రకాల అనారోగ్యాలతో బాధపడుతున్న వారు ఈ వైద్య శిబిరానికి వచ్చి తమకున్న సమస్యలను వైద్యులకు తెలియపరచి ఉచిత వైద్యాన్ని పొందుతున్నారు. వేలల్లో లక్షల్లో రూపాయలు…
CM Revanth Reddy : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది కాలం పూర్తి చేసుకున్న నేపథ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన విజయోత్సవాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా సోమవారం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ మార్గ్ లో హెచ్ఎండీఏ గ్రౌండ్స్ లో ఆరోగ్య ఉత్సవాలు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి 213 అంబులెన్స్ లకు పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. వైద్య ఆరోగ్య శాఖ..…
Free Heart Surgeries: గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న చిన్నారులకు యూకే వైద్యబృందం శుభవార్త అందించింది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిమ్స్‌లో ఉచితంగా వైద్యసేవలు అందించేందుకు యూకే వైద్యబృందం దవాఖానకు రానుందని డైరెక్టర్ డాక్టర్ నగరి బీరప్ప తెలిపారు.