M. Venkaiah Naidu: అమ్మ భాష నేర్చుకున్న తర్వాత ఇంగ్లీష్ నేర్చుకోండి..
- హైదరాబాద్ శిల్పారామంలో నాలుగు రోజుల పాటు అంతర్జాతీయ కళా ప్రదర్శన..
- ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు..
- లోక్ మంథన్ కార్యక్రమంను భాగ్యనగర్ లో నిర్వహించడం చాలా సంతోషకరం..
- మన కళలు, సంస్కృతులు, వాయిద్యాలను రక్షించుకోవాలి..
- ప్రకృతిని ప్రేమించే పవిత్ర మైన జాతి, హిందూ ధర్మం మనది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
M. Venkaiah Naidu: M. Venkaiah Naidu: అమ్మ భాష నేర్చుకున్న తర్వాత ఇంగ్లీష్ నేర్చుకోవాలని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. హైదరాబాద్ శిల్పారామంలో నాలుగు రోజుల పాటు అంతర్జాతీయ కళా ప్రదర్శనలో భాగంగా.. వెంకయ్య నాయుడు ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. రేపు లోక్ మంథన్ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించనున్నారు. కాగా.. వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. లోక్ మంథన్ కార్యక్రమంను భాగ్యనగర్ లో నిర్వహించడం చాలా సంతోషకరం అన్నారు. మళ్ళీ తిరిగి మన మూలాలకు వెళ్ళాలన్నారు. మన సాంస్కృతిక వారసత్వాలను కాపాడుకోవాలన్నారు. మన కళలు, సంస్కృతులు, వాయిద్యాలను రక్షించుకోవాలని తెలిపారు. మన సంస్కృతిని, మన భాషను, మన సంప్రదాయాలును మర్చిపోయామన్నారు. ప్రకృతిని ప్రేమించే పవిత్ర మైన జాతి, హిందూ ధర్మం మనదని తెలిపారు. ఇంగ్లీష్ వాడు ఆర్థికంగా దోచుకోవడమే కాదు మన మనస్సును కూడా దోచుకుని వెళ్ళిపోయాడన్నారు.
Read also: CV Anand: పోలీస్ ఉద్యోగం అంటే టెస్ట్ క్రికెట్ మ్యాచ్ లాంటిది..
Also Read
- Telangana New Bars : కొత్త బార్ల కోసం దరఖాస్తుల సునామీ.. ఎక్సైజ్ శాఖకు కాసుల వర్షం
- Scholarships : విద్యార్థులకు గుడ్‌న్యూస్.. రూ.204 కోట్ల స్కాలర్షిప్లు విడుదల
- MeeSeva : మీసేవ సర్టిఫికెట్లలో కొత్త మార్పు.. ఇక లామినేషన్ అవసరం లేదు
- Telangana: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో తెలంగాణ వాసి మృతి.. ప్రభుత్వం కీలక నిర్ణయం
దేవుడి దగ్గర పోవాలని అంటే ఇంగ్లీషు రావాలనే షరతులేమి లేవని దేవుడు చెప్పారని అన్నారు. సమయం వచ్చినప్పుడు ఎవరైనా రావాల్సిందే అని దేవుడు చెప్పారని తెలిపారు. ప్రముఖ వ్యక్తులు మాతృభాషలోనే చదువుకున్నారన్నారు. మోడీ ఇంగ్లీష్ మీడియం మొఖమే చూడలేదన్నారు. మనం భారతీయులం, మనం హిందువలమని గర్వంగా చెప్పుకోవాలని తెలిపారు. ఇంగ్లీష్ వ్యామోహం మంచిది కాదన్నారు. అమ్మ భాష నేర్చుకున్న తర్వాత ఇంగ్లీషు నేర్చుకోవాలన్నారు. కుటుంబాలు, పెళ్ళిళ్ళు విచ్ఛిన్నం అవుతున్నాయని తెలిపారు. కుటంబ వ్యవస్థను పటిష్ఠం చేసుకుందామన్నారు. మనశ్శాంతిగా ఉంటే అనుకున్న పలితాలు సాధించవచ్చని అన్నారు. శిల్పారామంలో ప్రజ్ఞవాహిని ఆధ్వర్యంలో లోక్ మంథన్ పేరుతో కళా ప్రదర్శనల పండుగ నిర్వహిస్తున్నారు. నేటి (గురువారం) నుంచి ఆదివారం దాకా వివిధ అంశాలపై చర్చలు, సమావేశాలు జరగనున్నాయి. 12 దేశాల నుంచి 1500 మందికి పైగా కళాకారులు రాకతో సందడి వాతావరణం నెలకొంది. 120కు పైగా సాంస్కృతిక కార్యక్రమాలకు రంగం సిద్ధమైంది. ఈ సందర్భంగా.. శిల్పారామంలో నాలుగు రోజుల పాటు ఉచితంగా సందర్శన నిర్వహించనున్నారు.
Telangana Olympic: నేడు తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ఎన్నికలు..
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!