M. Venkaiah Naidu: అమ్మ భాష నేర్చుకున్న తర్వాత ఇంగ్లీష్ నేర్చుకోవాలని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. హైదరాబాద్ శిల్పారామంలో నాలుగు రోజుల పాటు అంతర్జాతీయ కళా ప్రదర్శనలో భాగంగా.. ఎగ్జిబిషన్‌ను భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రారంభించారు.
మాజీ రాజ్యసభ సభ్యుడు యలమంచిలి శివాజీని ఆయన స్వగృహంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పరామర్శించారు. ఆంధ్ర ఉద్యమంలో ప్రజా ఉద్యమంలో యలమంచిలి శివాజీతో కలిసి పని చేశానని ఆయన తెలిపారు. సిద్ధాంతపర రాజకీయలు చేయకుండా కుల రాజకీయాలకు ప్రాముఖ్యత ఇస్తున్నారని.. రాజకీయాలకు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారని వెంకయ్యనాయుడు అన్నారు.
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలంగాణ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డిని మెచ్చుకున్నారు. రైతు రుణమాఫీ మార్గదర్శకాలకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులను స్వచ్ఛమైన తెలుగులో జారీ చేయడటం పట్ల వెంకయ్య నాయుడు హర్షం వ్యక్తం చేస్తూ.. ఎక్స్ వేదికగా అభినందనలు తెలియజేశారు.
బూతులు మాట్లాడే వ్యక్తుల చరిత్ర పోలింగ్ బూత్ లో మార్చేయాలని పిలుపునిచ్చారు.. తుపాకీ గుండు వల్ల విప్లవం రాదు.. ప్రజల ఆలోచనతో విప్లవం రావాలన్న ఆయన.. దేవస్థానంలో ప్రమాణాలు చేసే రాజకీయాలు పెరిగిపోయాయి.. ఎప్పుడు ఏ జెండా పట్టుకుంటాడు తెలియడం లేదని ఎద్దేవా చేశారు.