Telangana Olympic: నేడు హైదరాబాద్‌లో తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ఎన్నికలు జరుగనున్నాయి. ఉదయం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. సాయంత్రం 4.30 నుంచి కౌంటింగ్ ప్రారంభం అవుతుంది. సాయంత్రం 5 గంటల తర్వాత ఫలితాలు వెల్లడి కానున్నాయి. కాగా ఈ ఎన్నికల్లో అధ్యక్ష స్థానానికి మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, బ్యాడ్మింటన్ సంఘం ఉపాధ్యక్షుడు చాముండేశ్వర్ నాథ్ పోటీ పడుతున్నారు. కార్యదర్శి పదవి బరిలో మల్లారెడ్డి, బాబురావు నిలిచారు. ఇక ట్రెజరర్ పోస్టుకు సతీష్ గౌడ్, ప్రదీప్ కుమార్ మధ్య పోటీ నెలకొంది. మరో నలుగురు వైస్ ప్రెసిడెంట్, నలుగురు జాయింట్ సెక్రటరీ, పది మంది ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు, ఐదుగురు జిల్లా ఒలింపిక్స్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులను ఎన్నుకోవాలి. అయితే వీటిలో ఒక్కో పోస్టు పోటీలో ఉండడంతో ఏకగ్రీవం కానుంది. ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా ఏపీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సి.ప్రవీణ్ కుమార్ వ్యవహరిస్తున్నారు. ఎలక్టోరల్ కాలేజీలో వివిధ క్రీడా సంఘాలకు చెందిన 65 మంది ప్రతినిధులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. టీఓఏ ఎన్నికలను వ్యతిరేకిస్తూ తెలంగాణ బాక్సింగ్ అసోసియేషన్ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై విచారణ పూర్తయ్యే వరకు ఎన్నికల ఫలితాల ప్రకటనపై స్టే విధించిన విషయం తెలిసిందే..
Keesara Accident: కాపాడమని వేడుకున్న కనికరించలేదు.. బాధితుడు ఆసుపత్రికి చేరేలోపే..