తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతుంది.. ఇప్పటికే తాము ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చామంటున్న సీఎం రేవంత్‌రెడ్డి.. తెలంగాణ రైసింగ్ పేరుతో ఓ ప్రత్యేక లోగోను కూడా రూపొందించారు.. ఈ నెల 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ప్రజాపాలన- ప్రజా విజయోత్సవాల పేరుతో కార్యక్రమాలు నిర్వహించారు.. అయితే, కాంగ్రెస్ ఏడాది పాలనపై.. సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయాలపై ప్రతిపక్షం బీఆర్ఎస్ మండిపడుతోంది..
Read Also: Global Pandemic: కరోనా తర్వాత ప్రపంచాన్ని కలవరపెట్టే ‘‘మహమ్మారి’’ ఇదేనా..?
ఎప్పటి కప్పుడు.. ప్రభుత్వ నిర్ణయాలు.. ప్రజా వ్యతిరేక పోకడలను ఎండగడుతున్నారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ప్రతినిత్యం.. ఏదో ఒక అంశంపై సోషల్ మీడియా వేదికగా నిలదీస్తూనే ఉన్నారు.. సమయం దొరికితే ప్రతీ సమావేశం, సభ అని తేడాలేకుండా కడిగేస్తున్నారు.. అయితే, కాంగ్రెస్ పాలన ఏడాది పూర్తి చేసుకున్న తరుణంలో కేటీఆర్‌ను ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేయనుంది ఎన్టీవీ.. అసలు.. కాంగ్రెస్ ఏడాది పాలనకు కేటీఆర్ ఎన్ని మార్కులేస్తారు..? ఇంకా నాలుగేళ్ల సమయం ఉండగా.. అప్పుడే బీఆర్ఎస్‌కి తొందర ఎందుకు?.. అసలు పవర్ లేకుండా కేటీఆర్ ఉండలేకపోతున్నారా?.. జమిలి ఎన్నికలకు బీఆర్ఎస్ సిద్ధమైపోతుందా?.. ఎర్రవల్లి ఫాంహౌస్‌లోనే లగచర్ల దాడి ప్లాన్ చేశారా?.. కేసీఆర్ అసెంబ్లీని ఎందుకు తప్పించుకుంటున్నారా?.. ఫార్ములా ఈ రేస్‌లో అరెస్ట్ అయితే.. కేటీఆర్ ఏం చేస్తారు..? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధాలు ఇవ్వనున్నారు కేటీఆర్.. ఎన్టీవీతో రాత్రి 7 గంటలకు కేటీఆర్ ప్రత్యేక లైవ్‌షో ప్రారంభం కానుంది..