తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు వివాదాస్పదంగా మారింది.. అయితే, ఆమె తెలంగాణ తల్లి కాదు.. కాంగ్రెస్ తల్లి అని వ్యాఖ్యానించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఎన్టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన వివిధ అంశాలపై మాట్లాడారు.. తలరాత మార్చమని ప్రజలు అధికారం ఇచ్చారు.. కానీ, తల్లిని మార్చమని కాదు.. అంటూ తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణపై సెటైర్లు వేశారు..
కాంగ్రెస్ పాలన ఏడాది పూర్తి చేసుకున్న తరుణంలో కేటీఆర్‌ను ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేయనుంది ఎన్టీవీ.. అసలు.. కాంగ్రెస్ ఏడాది పాలనకు కేటీఆర్ ఎన్ని మార్కులేస్తారు..? ఇంకా నాలుగేళ్ల సమయం ఉండగా.. అప్పుడే బీఆర్ఎస్‌కి తొందర ఎందుకు?.. అసలు పవర్ లేకుండా కేటీఆర్ ఉండలేకపోతున్నారా?.. జమిలి ఎన్నికలకు బీఆర్ఎస్ సిద్ధమైపోతుందా?.. ఎర్రవల్లి ఫాంహౌస్‌లోనే లగచర్ల దాడి ప్లాన్ చేశారా?.. కేసీఆర్ అసెంబ్లీని ఎందుకు తప్పించుకుంటున్నారా?..