మహిళా దినోత్సవం సందర్భంగా ఇటీవల హైదరాబాద్ నగరంలోని యాప్రాల్‌లో మహిళల కోసం ప్రత్యేకంగా నిర్వహించిన ఫుట్‌బాల్ టోర్నీ ముగిసింది. స్కైకింగ్స్ సహకారంతో ఒలింపియన్ అసోసియేషన్ యాప్రాల్‌లోని మెహర్‌బాబా కాలనీలో ఈ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌ను ఏర్పాటు చేసింది. ఈ టోర్నీకి ముఖ్య అతిథిగా నేరేడ్‌మెట్ 136వ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి కొత్తపల్లి మీనా ఉపేందర్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె ఆసక్తి గల మహిళలందరూ ఫుట్‌బాల్ లీగ్‌లో పాల్గొనేందుకు ముందుకు రావాలని ప్రోత్సహించారు. మహిళలందరూ తమ లక్ష్యాలను సాధించడానికి…