HYD CP Anand: ఆన్ లైన్ మోసాలు చేస్తున్న ముఠాను పట్టుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు
- మూడు రాష్ట్రాల్లో తెలంగాణ పోలీసుల ఆపరేషన్..
- బీహార్, జార్ఖండ్, గుజరాత్‌లో 52 మంది సైబర్ నేరగాళ్లు అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు..
- ఓటీపీలతో.. స్టాక్ ట్రేడింగ్ పేరుతో వందల కోట్ల రూపాయలు మోసం చేసిన సైబర్ కేటుగాళ్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
HYD CP Anand: అమాయకులను టార్గెట్ చేసుకుని ఆన్ లైన్ మోసాలకు పాల్పడుతున్న ముఠాను హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో కీలక పాత్ర పోషించిన ఓ బ్యాంక్ మేనేజర్ తో పాటు 52 మందిని అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి భారీగా చెక్ బుక్స్, సెల్ ఫోన్స్, రబ్బర్ స్టాంప్స్, డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్ లను సైబర్ క్రైం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. నిందితులు మూడు రకాల సైబర్ క్రైంకు పాల్పడ్డారు.. 52 మంది నిందితులు ఇన్వాల్వ్ అయ్యారు.. ముగ్గురు బ్యాంక్ ఉద్యోగులు అరెస్ట్ చేశాం.. ఫేస్ బుక్ బ్రౌజింగ్ లో వాట్సప్ గ్రూప్ ద్వారా నిందితులు ఆకర్షిస్తున్నారు.. ఒక వ్యక్తిని టార్గెట్ చేసి రూ. 93 లక్షల ట్రేడింగ్ ఫ్రాడ్ చేశారు అని ఆయన తెలిపారు. మరో బాధితుడు విడతల వారికి రూ. 2.06 డబ్బును కోల్పోయాడు. అనీషా యాప్ ద్వారా వాట్సప్ గ్రూప్ లో ఇన్వెస్ట్ చేసి మోసపోయాడు.. మ్యూల్ అకౌంట్ ఓపెన్ చేసి బ్యాంకు అధికారుల సహకారంతో ఫ్రాడ్ చేస్తున్నారు అని సీపీ ఆనంద్ చెప్పుకొచ్చారు.
Read Also: Sanjana : డైరెక్టర్ గా మారిన హీరోయిన్.. మొదటి సినిమా ఆ హీరోతోనే
Also Read
- Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
- Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
- Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
- Ponguleti Srinivas :22-ఎ భూములపై ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నెల రోజుల్లోనే పరిష్కారం
ఇక, గుర్తు తెలియని యాప్స్, గ్రూప్స్ లో జాయిన్ కావొద్దు అని సీపీ సీవీ ఆనంద్ చెప్పుకొచ్చారు. ఆన్ ల్లైన్ ఇన్వెస్ట్ మెంట్ తో జాగ్రత్తగా ఉండాలన్నారు. సైబర్ క్రైం విషయంలో 2025లో అవగాన చాలా ముఖ్యం.. ఎడ్యుకేటెడ్ వ్యక్తులు సైతం మోసపోతున్నారు.. రూ. 3 వేల 500 కోట్లు గత ఏడాది సైబర్ క్రైం ద్వార మోసం జరిగింది అన్నారు. ఇంకా, 13 శాతం వరకే రికవరీ అయ్యింది.. సైబర్ క్రైంలో రికవరీ చాలా కష్టం, అవగాహన చాలా ముఖ్యం అన్నారు. నిందితులు ఇతర రాష్ట్రాలకు, దేశాలకు చెందిన వ్యక్తులు కావటంతో విచారణ కష్టం అవుతుందన్నారు. ఈ ఏడాది అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం.. అమయకులను టార్గెట్ చేసుకుని ఆన్ లైన్ మోసాలకు పాల్పడుతున్న ముఠాను పట్టుకున్నామని హైదరాబాద్ కమిషనర్ ఆనంద్ పేర్కొన్నారు.
Read Also: Vasi Zakariya: పోలీసుల అదుపులో ఖలీఫా సంస్థ జాతీయ అధ్యక్షుడు జకర్య
అలాగే, హైదరాబాద్ లో 33 కేసులు తెలంగాణలో 74 దేశవ్యాప్తంగా 576 కేసులు నమోదు చేశామని సీపీ ఆనంద్ చెప్పారు. రూ. 88.3కోట్లు బాధితులకు నష్టం వాటిల్లింది.. రూ. 2. 87 కోట్లు ఫ్రీజ్ చేశాం.. ముగ్గురు కీలక సూత్రదారులు ఉన్నారు.. ముంబైకి చెందిన జునైద్ నగదును క్రిప్టో కరెన్సికి మారుస్తున్నాడు.. డిజిటల్ అరెస్ట్ కేసులో ఇద్దరు డాక్టర్స్ మోసపోయారు.. చీఫ్ జస్టిస్ సుప్రీంకోర్టు పేరుతో ఫేక్ ఆర్డర్ తయారు చేసి.. మీ కేసు క్లోజ్ చేస్తాం నగదు డిపాజిట్ చేయాలని డిమాండ్ చేశారు.. దీంతో రూ. 3 కోట్ల ఎఫ్డీలను నిందితులకు చెల్లంచారు.. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశామని ఆయన వెల్లడించారు. ఆర్బీఐతో సమావేశం నిర్వహించాం.. అన్నీ బ్యాంకు హెడ్స్ హాజరయ్యారు.. సైబర్ క్రైం అరికట్టడంలో బ్యాంకులు కీలక పాత్ర వహించాలి.. ఒక కమిటీ ఏర్పాటు చేశాం.. నివేదిక సమర్పించాక చర్యలు చేపడతామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఆనంద్ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Prabhas : వాయిదాలకు కేరాఫ్ అడ్రస్ ప్రభాస్ మూవీస్
-
Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
-
Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
-
Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
-
RT 78 : జెట్ స్పీడ్‌లో రవితేజ.. వివేక్ ఆత్రేయతో ‘తులాభారం’ స్టార్ట్
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!