Bandi Snajay: ఆ పార్టీని నమ్ముకుంటే.. బీఆర్ఎస్‌కు పట్టిన గతే కాంగ్రెస్‌కు పడుతుంది..
- ఎంఐఎం ఐరన్ లెగ్ పార్టీ..
- గతంలో బీఆర్ఎస్ పంచన చేరి ఆ పార్టీని నిండా ముంచింది..
- ఎంఐఎం పార్టీని నమ్ముకుంటే కాంగ్రెస్ కు అదే గతి పడుతుంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandi Snajay: ఎంఐఎం ఐరన్ లెగ్ పార్టీ అని కేంద్ర మంత్రి బండి సంజయ్ అని కీలక వ్యాఖ్యలు. గతంలో బీఆర్ఎస్ పంచన చేరి ఆ పార్టీని నిండా ముంచిందన్నారు. ఆ పార్టీని నమ్ముకుంటే కాంగ్రెస్ కు అదే గతి పడుతుందన్నారు. ఎంఐఎంతో కలిసి పక్కా ప్రణాళిక ప్రకారం పవిత్రమైన అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీని దెబ్బతీసే కుట్ర చేస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. మీ ప్రభుత్వ నిర్లక్ష్యం గురుకులాల్లో విషాహారం తిని విద్యార్థులు చస్తుంటే ఏనాడైనా పరామర్శించారా? అని ప్రశ్నించారు. హాస్టళ్లలో పురుగుల అన్నం తిని, పాముకాటుకు గురై నిత్యం చనిపోతుంటే మీరెన్నడైనా బాధ్యత వహించారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీకో న్యాయం…. ఇతరులకు ఒక న్యాయమా? అని మండిపడ్డారు.
Read also: Ram Charan Selfie Video: సెల్ఫీ వీడియోతో థ్యాంక్యూ అమెరికా.. అంటున్న గ్లోబల్ స్టార్
Also Read
ఇకనైనా రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చర్యలను వీడాలన్నారు. లేనిపక్షంలో బీఆర్ఎస్ కు పట్టిన గతే కాంగ్రెస్ కు పడుతుందన్నారు. అల్లు అర్జున్ వ్యక్తిత్వాన్ని హననం చేసేలా సీఎం వ్యాఖ్యలున్నాయని తెలిపారు. తెలుగు సినిమా ఇండస్ట్రీపై పగ బట్టినట్లుగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని తెలిపారు. ‘‘సంధ్య’’ ఘటనలో మహిళ మరణాన్ని ప్రతి ఒక్కరూ ఖండించారని గుర్తు చేశారు. శ్రీతేజ్ కోలుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకోవడంతోపాటు అందరూ ఆ కుటుంబానికి బాసటగా నిలిచారన్నారు.
Read also: Bandi Sanjay: 50 ఏళ్లుగా హీరోలు వస్తున్నారు.. సెక్యురిటీ కల్పించకపోవడం ప్రభుత్వ వైఫల్యం..
సమస్య ముగిసిన తరువాత అసెంబ్లీలో ఎంఐఎం సభ్యుడితో ప్రశ్న అడిగించుకుని సినిమా లెవల్ లో కథ అల్లి మళ్లీ సమస్యను సృష్టించడం సిగ్గు చేటన్నారు. సినిమా ఓపెనింగ్ రోజు అగ్ర హీరోలంతా ఆర్టీసీ క్రాస్ రోడ్ కు రావడం 50 ఏళ్లుగా షరా మామూలే. పైగా పాన్ ఇండియా సినిమా బెన్ ఫిట్ షోకు భారీ ఎత్తున ప్రేక్షకులు రావడం కూడా సాధారణమే. ఈ విషయం తెలిసి కూడా ముందస్తు రక్షణ ఏర్పాట్లు చేయకపోవడం ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమే. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి అమాయక మహిళ బలై, ఆమె కుమారుడు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంటే.. ఆ తప్పును ఇతరులపై నెట్టడటం సిగ్గు చేటని తెలిపారు.
Telangana DGP: ప్రజల భద్రత కంటే.. సినిమా ప్రమోషన్ ముఖ్యం కాదు!
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?