EX Minister Jagadish Reddy: ఎల్కతుర్తిలో జరిగిన బీఆర్ఎస్ బహిరంగ సభపై ప్రజల్లో చర్చ జరుగుతోంది అని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. ఇక, సభకు వచ్చిన తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు.. బహిరంగ సభలో రేవంత్ రెడ్డి పేరు కేసీఆర్ చెప్పలేదని సీఎం బాధపడుతున్నారు ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ ని కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు గుర్తు పెట్టుకోవడం లేదని సెటైర్లు.. ఇక, తెలంగాణను ఆంధ్రాలో కలిపింది కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణ పేరు ఎత్తితే వాళ్ళను నక్సలైట్ల పేరుతో కాంగ్రెస్ కాల్చి చంపింది అని గుర్తు చేశారు. చంద్రబాబు చేతిలో నడ్డి విరిగిన కాంగ్రెస్ 2004లో టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంది.. యూపీఏ కామన్ మినిమమ్ ప్రోగ్రామ్ లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును టీఆర్ఎస్ పెట్టించింది.. కేసీఆర్ తిడుతున్న వాళ్ళు నాడు సమైక్యాంధ్ర తొత్తుల కింద ఉన్నారు అని జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.
Read Also: Jagga Reddy: మేము ఇచ్చిన స్వేచ్ఛతోనే బీఆర్ఎస్ సభ జరిగింది.. లేకపోతే..
అయితే, తెలంగాణకు ఎప్పటికి కాంగ్రెస్ పార్టీనే విలన్ అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ పేరు విలన్ గానే తెలంగాణ చరిత్రలో నిలిచిపోతుంది.. 16 నెలల్లో సమైక్య రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు వచ్చాయని ఆరోపించారు. ఒక్క ఏడాదిలోనే గురుకుల పాఠశాలల్లో 90 మంది విద్యార్థులు చనిపోయారు అని చెప్పుకొచ్చారు. ఇక, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తర కుమార ప్రగల్భాలు ఆపాలని సూచించారు. ఈ రోజు వరకు ఎంత ధాన్యం కొన్నారో ఉత్తమ్ కుమార్ లెక్క చెప్పాలి అని డిమాండ్ చేశారు. ఎన్ని వడ్లు కొన్నారు?.. ఎంత బోనస్ ఇచ్చారో చెప్పాలన్నారు. చెప్పకపోతే మీరు రండలు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ మీద ఎందుకు ఏడుస్తున్నారు.. కేసీఆర్ మీకు సంవత్సరం పైనే సమయం ఇచ్చారని జగదీష్ రెడ్డి తెలిపారు.
Read Also: Basara Triple IT: బాసర ట్రిపుల్ ఐటీలో మెస్ టెండర్ల ఎంపిక ప్రక్రియపై స్థానికుల అనుమానాలు..
ఇక, NDSA ఇచ్చిన రిపోర్ట్ నిజమని నిరూపించు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాజీమంత్రి జగదీష్ రెడ్డి సవాల్ విసిరారు. కాంగ్రెస్ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ తెలంగాణకు వస్తే ఎవరూ పట్టించుకోలేదని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఏం మాట్లాడుతారోనని మీరు, ప్రజలు ఎదురు చూశారు.. అసెంబ్లీలో పిల్లల్ని ఏం పీకలేకపోతున్నారు.. అవతలి టీమ్ బలహీనంగా ఉందని పిల్లల్ని అసెంబ్లీకి పంపుతున్నారు.. కేసీఆర్ ఏ టైంకి, ఎట్లా రావాలో అసెంబ్లీకి వస్తారు.. ప్రతి రైతుకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని జీవో ఇచ్చారు.. 41 వేల కోట్లు రుణమాఫీ అని చెప్పి 21 వేల కోట్లు చేశామని చెప్పారు.. ఇప్పుడు రైతు రుణమాఫీ పూర్తి అయిందని అంటున్నారు.. బీఆర్ఎస్ సభను చూసి లాగులు తడుపుకుంటున్నారని సెటైర్లు వేశారు.