Telangana Thalli Statue: తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇవాళ (సోమవారం) సాయంత్రం 6 గంటలకు సచివాలయ ఆవరణలో విగ్రహ ఆవిష్కరణ జరగనుంది. లక్ష మంది మహిళల సమక్షంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ కార్యకర్తలు, స్వయం సహాయక సంఘాల మహిళలు, రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద ఎత్తున మహిళలు తరలివచ్చేలా ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. విగ్రహ రూపులేఖల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపినట్లు తెలిసింది. ఆయన సూచనల మేరకు విగ్రహ నమూనాను సిద్ధం చేసి, అందుకు అనుగుణంగా విగ్రహాన్ని తయారు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రతిపక్ష పార్టీలను కూడా ఆహ్వానించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Read also: Telangana Assembly Session 2024: అసెంబ్లీ సమావేశాలకు గులాబీ బాస్ రాకపై నో క్లారిటీ..
మొదట ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ చీఫ్ సోనియా గాంధీ చేతుల మీదుగా నిర్వహించాలని భావించినప్పటికీ, ఆమె అనారోగ్య కారణంగా రాలేకపోతున్నారని సమాచారం. కాగా.. తెలంగాణ తల్లి విగ్రహాన్ని హైదరాబాద్ శివారులోని పెద్ద అంబర్‌పేట వద్ద ప్రత్యేకంగా రూపొందించారు. గత తెలంగాణ తల్లి విగ్రహం.. జరీ అంచు ఉన్న పట్టుచీర, మెడలో కంటె, బంగారు హారం ఎడమ చేతిలో బతుకమ్మ, కుడి చేతిలో మొక్కజొన్న చేతికి బంగారు గాజులు కాళ్లకు వెండి మెట్టెలు నడుముకు వడ్డాణం ఉండగా.. బంగారు అంచు ఉన్న ఆకుపచ్చ చీర మెడలో కంటె, బంగారు గొలుసు ఎడమ చేతిలో వరి, జొన్న, మొక్క జొన్న, సజ్జ అభయహస్తంగా కుడిచేయి చేతికి ఆకుపచ్చ గాజులు కాళ్లకు మెట్టెలు, పట్టీలు పీఠంలో పిడికిళ్లు పోరాట పటిమను ప్రతిబింబిస్తుంది. తెలంగాణ తల్లి విగ్రహం రూపంలో రాచరికానికి సంబంధించిన ఆనవాళ్లు లేకుండా ప్రభుత్వం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంది.
Telangana Assembly Sessions 2024: నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు..