CM Revanth Reddy: రోశయ్య వ్యవహారాలను చక్కపెట్టేవారు కాబట్టే.. అప్పటి ముఖ్యమంత్రులు ప్రశాంతంగా పనిచేశారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మాజీ సీఎం రోశయ్య 3వ వర్థంతి కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ.. తెలంగాణ శాసనసభలో రోశయ్య లా వ్యూహాత్మకంగా సమస్యను పరిష్కరించే నాయకుడు లేరన్న లోటు కనిపిస్తోందని సీఎం రేవంత్ అన్నారు. సందర్భం, సమయం వచ్చినప్పుడు సోనియాగాంధీ రోశయ్యని ఎంపిక చేశారని తెలిపారు. పార్టీ కోసం ఆయన ఎంత నిబద్ధతగా పనిచేశారో అందుకు నిదర్శనం అని రేవంత్ రెడ్డి అన్నారు. ట్రబుల్ షూటర్‌గా రోశయ్య కీలక పాత్ర పోషించబట్టే వైఎస్సార్ పని ఈజీ అయ్యేదని తెలిపారు. రోశయ్య ఉన్నప్పుడు నెంబర్-2 ఆయనే.. నెంబర్ 1 మాత్రమే మారేవారని తెలిపారు. నెంబర్ 2లో ఉన్నా.. ఆయన ఎప్పుడూ తన పైన ఉన్నవారిని దాటిపోవాలని అనుకోలేదని సీఎం అన్నారు.
Read also: HYDRA : హైడ్రా కీలక నిర్ణయం.. పబ్లిక్ ఆస్తుల పరిరక్షణలో కొత్త కార్యక్రమం
ఏరోజు కూడా తనకు ఈ పదవి కావాలని రోశయ్య అడగలేదని సీఎం అన్నారు. పార్టీ పట్ల నిబద్ధత, క్రమశిక్షణ వల్లనే ఆయనకు పదవులు వచ్చాయని తెలిపారు. 2007లో నేను శాసన మండలిలో సభ్యుడుగా ఉన్నప్పుడు నాకు కొన్ని సలహాలు సూచనలు ఇచ్చారని గుర్తు చేసుకున్నారు. ఇరిగేషన్ శాఖపై బాగా మాట్లాడుతున్నావని నన్ను ప్రోత్సహించారన్నారు. లైబ్రరీకి వెళ్లి మరింత సమాచారం సేకరించి మాట్లాడితే బాగుంటుందని సూచన చేశారని సీఎం తెలిపారు. నాకు సూచనలు ఇచ్చిన రోశయ్యని అనుసరించి.. ఒకానొక సందర్భంలో ఆయన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కల్పించానని తెలిపారు. అప్పుడు రోశయ్య ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నించాలని, అధికార పక్షంలో ఉన్నప్పుడు పరిష్కరించాలని సూచన చేశారని తెలిపారు. ఇప్పుడు అలాంటి స్ఫూర్తి చట్టసభల్లో లోపించిందని సీఎం అన్నారు. ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే పక్షానికి ఏదో పోతుందని రీతిగా మారిందని అన్నారు.
Read also: Paracetamol : భారత్ లోనే తయారీ.. అతితక్కువ ధరకే లభించనున్న పారాసెటమాల్
ఏ ఒక్కరోజు రోశయ్య పదవుల కోసం పోటీ పడలేదన్నారు. ఆయన ప్రతిభను చూసి పదవులే ఆయన దగ్గరికి వచ్చాయన్నారు. అది మంత్రి పదవి అయినా.. ముఖ్యమంత్రి పదవి అయినా.. గవర్నర్ పదవి అయినా.. అధిష్టానం పిలిచి ఇచ్చిందని గుర్తు చేశారు. నిఖార్సైన అయినా హైదరాబాది రోశయ్య అన్నారు. హైదరాబాదులో ఆయన విగ్రహం లేకపోవడం లోటే అన్నారు. సీఎంగా రోశయ్య ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడుతో నేను వెళ్లి కలిశానని అన్నారు. ఆ సందర్భంగా రోశయ్య మాకు ఒక విషయం చెప్పారు.. నాకు చీరాలలో ఆస్తులు లేవు, ఉన్నది అమ్ముకుని హైదరాబాదులో ఇల్లు కట్టుకున్న అన్నారు. నాకు ఆంధ్ర-తెలంగాణ రెండు ఒకటే అని చెప్పారని గుర్తుచేశారు. ఆర్యవైశ్యులకు ప్రభుత్వంలో ప్రాధాన్యత కల్పించే అంశం అధిష్టానం దృష్టికి తీసుకు వెళ్తా అని తెలిపారు.
HYDRA : హైడ్రా కీలక నిర్ణయం.. పబ్లిక్ ఆస్తుల పరిరక్షణలో కొత్త కార్యక్రమం