Harish Rao: ప్రశ్నించే గొంతును నిర్బంధాలతో అణిచివేయలేరని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అక్రమ అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలన గాలికి వదిలి అరెస్టులు, అక్రమ కేసులు, ముందస్తు నిర్బంధాలు విధిస్తూ రాజకీయ కక్ష తీర్చుకోవడం సిగ్గుచేటన్నారు. పచ్చని పొలాల్లో ఫార్మసిటీ పేరిట చిచ్చు పెట్టడమే మీ ప్రజాపాలనా? అని ప్రశ్నించారు. నడి రాత్రి రైతులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో పెట్టడమే మీ ఇందిరమ్మ రాజ్యమా? అని మండిప్డడారు. ప్రశ్నించే గొంతులను అక్రమ అరెస్టులు, కేసులు, నిర్బంధాలతో అణిచివేయలేరని హెచ్చరించారు. మీ బెదిరింపులకు @BRSparty భయపడదన్నారు. ప్రజాక్షేత్రంలోనే మిమ్మల్ని ఎండగడతం. ప్రజల తరఫున నిలదీస్తూనే ఉంటామన్నారు. అరెస్టు చేసిన పట్నం నరేందర్ రెడ్డిని, రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నామని హరీష్ రావు అన్నారు.
Read also: BRS KTR: ఎంత అణిచి వేస్తే అంత పోరాటం చేస్తాం..
మరోవైపు మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. పట్నం నరేందర్ రెడ్డి నివాసం వద్దకు వెళ్లారు. పట్నం నరేందర్ రెడ్డి సతీమణితో మాట్లాడారు. అక్కడ సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. కలెక్టర్ పై దాడి జరగడం బాధాకరమని తెలిపారు. ఈ ఘటన బీఆర్ఎస్ నేతలపై కావాలని కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి నియోజకవర్గం లో జరిగిన ఘటన.. అధికారుల మీద కోపంతో కాదు ముఖ్యమంత్రి మీద కోపం ఈ ప్రభుత్వం మీద కోపంతో దాడి జరిగిందన్నారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం రైతుల బాధ వినండి అన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ల్యాండ్ కి సంబంధించి 8 నెలలు రైతులను ఒప్పించి వాళ్ళకి ఏం కావాలో తెలుసుకున్నామన్నారు. ఇది న్యాయం కాదు, రెచ్చగొట్టే విధంగా చేస్తున్నారని మండిపడ్డారు. అక్రమంగా అరెస్టు చేయడం మంచిది కాదన్నారు. ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల వల్ల ఈ ఘటనలు జరుగుతున్నాయని మండిపడ్డారు.
New Dream Spa: స్పా ముసుగులో వ్యభిచారం.. చందానగర్ లో పోలీసులు రైడ్..