DK Aruna: రాజకీయాల్లో ఉన్నప్పుడు నోరు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడాలి
- ఓ సినీ కుటుంబంపై కొండ సురేఖ చేసిన ఆరోపణలు అభ్యంతకరం..
- ఎవరి వ్యక్తిగత విషయాలతో రాజకీయాలు ముడి పెట్టడం సరికాదు..
- రాజకీయాల్లో ఉన్నప్పుడు నోరు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడాలి: డీకే అరుణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DK Aruna: చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం వద్ద బీజేపీ మహిళ మోర్చ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో ఎంపీ డీకే అరుణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై రియాక్ట్ అయ్యారు. కొండా సురేఖతో నాకు మంచి అనుబంధం ఉంది.. గతంలో ఇద్దరం కలిసి మంత్రులుగా పని చేశాం.. కానీ ఓ సినీ కుటుంబంపై ఆమె చేసిన ఆరోపణలు అభ్యంతకరంగా ఉన్నాయని చెప్పుకొచ్చారు. సినిమా ఇండ్రస్టీలో ఆ కుటుంబానికి ప్రత్యేక పేరు ఉంది.. ఎవరి వ్యక్తిగత విషయాలతో రాజకీయాలు ముడి పెట్టడం సరికాదు అని బీజేపీ ఎంపీ సూచించారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు నోరు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడాలి అని డీకే అరుణ తెలిపారు.
Read Also: Israel-Iran War: ఇరాన్ చమురు, గ్యాస్ కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడి చేయొచ్చంటూ వార్తా కథనాలు
Also Read
ఇక, ఒకసారి మాట్లాడి మళ్లీ వెనక్కు తీసుకోలేమని మాజీమంత్రి, బీజేపీ ఎంపీ డీకే అరుణ అన్నారు. రాజకీయ నాయకులు ఆవేశం వచ్చినా ఆలోచించి మాట్లాడాలి.. ఒకరి మీద కోపం ఇంకొకరి మీద తీయడం సరికాదు అని చెప్పారు. ఒక మహిళను పట్టుకొని, సినిమా కుటుంబాన్ని కించపరిచే విధంగా మాట్లాడం కరెక్ట్ కాదు అని పేర్కొన్నారు. అలాగే, భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆగ్రహానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం గురి కావొద్దు అని తెలిపారు. అమ్మవారి ఆలయం దగ్గర మహిళలు బతుకమ్మ ఆడటానికి కోర్టు పర్మిషన్ తీసుకోవాల్సి వచ్చింది.. తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ నియంతృత్వ పాలనా కొనసాగుతుందని డీకే అరుణ చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ జెర్సీపై టేప్.. ‘3’ నంబర్ వెనుక అసలు కథేంటి?
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
Tuesday Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి వ్యాపారంలో డబ్బే డబ్బు!
-
Gandhari: తాప్సీ ‘గాంధారి’కి విడుదలకు ముందే షాక్.. కాపీ ఆరోపణలతో ముదిరిన వివాదం!
-
Rajni Autobiography : ఆత్మకథ రాస్తున్న రజనీ.. సినిమాగా తీస్తే అదొక అద్భుతమే
ట్రెండింగ్
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్‌ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!