AP Local Body Elections 2026: ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో భారీగా నామినేషన్లు.. YCP నుంచే ఎక్కువ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Local Body Elections 2026: ఆంధ్రప్రదేశ్ స్థానిక ఎన్నికల సమయంలో కొన్ని ఘటనలు జరిగినా.. పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,942 వార్డు స్థానాలకు 24,451 నామినేషన్లు అందాయి. మేయర్, చైర్పర్సన్ పదవులకు కలిపి 1,358 నామినేషన్లు దాఖలయ్యాయి. అక్టోబర్ 18న నామినేషన్ల దాఖలుకు చివరి రోజు కావడంతో అభ్యర్థులు పెద్ద సంఖ్యలో తమ నామినేషన్లను సమర్పించారు. ఇక, చివరి రోజైన అక్టోబర్ 18న ఒక్కరోజే మేయర్, చైర్పర్సన్ పదవులకు 1,009 నామినేషన్లు దాఖలయ్యాయి. అదే రోజు వార్డు సభ్యుల స్థానాలకు ఏకంగా 16,282 నామినేషన్లు అందాయి. దీంతో చివరి రోజు నామినేషన్ల కేంద్రాల వద్ద అభ్యర్థుల సందడి నెలకొంది.
కార్పొరేషన్లలో మేయర్ పదవులకు 320 నామినేషన్లు దాఖలు కాగా, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో చైర్పర్సన్ పదవులకు 1,038 నామినేషన్లు వచ్చాయి. వార్డు స్థానాల విషయానికి వస్తే, కార్పొరేషన్లలో 8,198 నామినేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో 16,253 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక, మేయర్, చైర్పర్సన్ పదవులకు పార్టీలవారీగా వచ్చిన నామినేషన్లలో వైఎస్సార్సీపీ నుంచి 367, తెలుగుదేశం పార్టీ నుంచి 329, కాంగ్రెస్ నుంచి 117, జనసేన నుంచి 100 నామినేషన్లు అందాయి. స్వతంత్ర అభ్యర్థుల నుంచి 287, ఇతర పార్టీల నుంచి 158 నామినేషన్లు దాఖలయ్యాయి.
Also Read
- SEC: ఏపీలో మరో ఎన్నికల సందడి.. 13 వేల పంచాయతీలు, 23 మున్సిపాలిటీలపై ఫోకస్
- Illegal Mining : అక్రమ మైనింగ్‌కు చెక్.. ఏపీ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు
- CM Chandrababu: ఏపీకి భారీ పెట్టుబడులే లక్ష్యం.. SIPBలో చంద్రబాబు కీలక ఆదేశాలు
- AP Local Body Elections: ఏపీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో రీపోలింగ్ స్టార్ట్..
వార్డు సభ్యుల స్థానాలకు తెలుగుదేశం పార్టీ నుంచి అత్యధికంగా 9,460 నామినేషన్లు వచ్చినట్లు వివరాలు వెల్లడిస్తున్నాయి. వైఎస్సార్సీపీ నుంచి 8,175, జనసేన నుంచి 2,324, కాంగ్రెస్ నుంచి 416 నామినేషన్లు దాఖలయ్యాయి. స్వతంత్ర అభ్యర్థుల నుంచి 2,586, ఇతర పార్టీల నుంచి 1,490 నామినేషన్లు అందాయి. ఇదిలా ఉండగా, కడప జిల్లా మైదుకూరు మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను ప్రస్తుతానికి నిలిపివేసినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా తెలిపారు. కడప జిల్లా కలెక్టర్ నుంచి అందిన నివేదిక ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. మైదుకూరు ఎన్నికలపై తదుపరి చర్యలు ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా కొనసాగనున్నాయి.
తాజావార్తలు
-
Ranbir Kapoor: యాక్టింగ్‌కి రణ్‌బీర్ కపూర్ గుడ్‌బై? మరో పదేళ్లే అంటూ షాకింగ్ కామెంట్స్!
-
Senior Stars : బాలీవుడ్ భామలతో చిందేయాల్సిందే అంటున్న సీనియర్ హీరోలు
-
PM Modi: ఈసారీ వాళ్ల మధ్యే నా దీపావళి.. ప్రధాని మోడీ కీలక ప్రకటన!
-
Kamal Haasan : 23 ఏళ్ళకూ అదే పాట పాడుతున్న కమల్ హాసన్
-
Rakul : రకుల్’ను కాపాడిన రామాయణ
ట్రెండింగ్
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!
-
Surekha Vani: వైరల్ వీడియోపై రిప్లై.. అకౌంట్ హ్యాక్ అయిందంటూ..!
-
IND vs NZ 2nd ODI: 134 పరుగులకే న్యూజిలాండ్ ఆలౌట్.. 4 వికెట్లతో అదరగొట్టిన గర్నూర్ బ్రార్..!
-
స్పోర్టీ లుక్, 420cc ట్విన్ సిలిండర్ ఇంజిన్‌తో BMW నుంచి కొత్త F 450 GS Sport బైక్ లాంచ్..!