Harish Rao : జర్మనీ ఉద్యోగాల పేరుతో మోసమా? టామ్కామ్పై హరీష్ రావు ఫైర్
- జర్మనీ ఉద్యోగాల పేరుతో రూ.4.5 లక్షల వసూలు?
- 75 మంది నిరుద్యోగులకు రెండేళ్లుగా ఎదురుచూపులు
- బాధితులకు పరిహారం చెల్లించాలని హరీష్ రావు డిమాండ్
- టామ్కామ్పై సీఐడీ విచారణకు డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విదేశాల్లో ఉద్యోగాల పేరుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిరుద్యోగ యువతను నిలువునా ముంచిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వ రంగ సంస్థ అయిన ‘టామ్‌కామ్’ (TOMCOM) ద్వారా జర్మనీలో కొలువులంటూ ప్రచారం చేసి, అమాయక యువత జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడిందని ఎక్స్ వేదికగా మండిపడ్డారు. రాష్ట్రంలోని 15 జిల్లాలకు చెందిన 75 మంది నిరుద్యోగుల నుంచి వీసాలు, పరీక్షల పేరిట ఒక్కొక్కరి వద్ద దాదాపు రూ. 4.5 లక్షల వరకు వసూలు చేసి రెండేళ్లుగా మోసం చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ మాటలు నమ్మి తల్లిదండ్రులు, భార్యల మెడలోని పుస్తెలతాడును తాకట్టు పెట్టి డబ్బులు కట్టిన యువకులు.. నేడు ఉద్యోగాలు రాక, మరోవైపు అప్పుల వడ్డీలు కట్టలేక రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇంటర్వ్యూలు లేవు.. లక్నో కోర్టుతో బెదిరింపులు
ప్రభుత్వం అధికారికంగా చేపట్టిన ఈ ప్రక్రియలో రెండేళ్లు గడిచినా కనీసం ఒక్క అభ్యర్థికీ జర్మన్ కంపెనీతో ఇంటర్వ్యూ ఇప్పించలేని దౌర్భాగ్య స్థితిలో ప్రభుత్వం ఉందని హరీష్ రావు ఎద్దేవా చేశారు. బేసిక్ లాంగ్వేజ్ పరీక్ష (B1) పాసైన వారికి మళ్లీ B2 అంటూ కొత్త కొర్రీలు పెడుతున్నారని, తొమ్మిది మంది జర్మనీకి వెళ్తున్నారంటూ ఘనంగా ప్రచారం చేసుకుని తీరా ఒక్కరిని కూడా పంపించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విదేశాల్లో ఏదైనా సమస్య వస్తే ఏకంగా 1,000 కిలోమీటర్ల దూరంలోని లక్నో కోర్టుకు వెళ్లాలని అమాయక యువతతో అగ్రిమెంట్లపై బలవంతంగా సంతకాలు పెట్టించుకోవడం దారుణమని దుయ్యబట్టారు. టామ్‌కామ్ ద్వారా ఇప్పటివరకు విదేశాల్లో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారంటూ ఆర్టీఐ (RTI) ద్వారా సమాచారం కోరినా, చట్టబద్ధమైన గడువు దాటినా ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాధానం లేకపోవడం శోచనీయమన్నారు. బాధితులు న్యాయం కోసం కన్నీరు కారుస్తుంటే, కార్మిక శాఖ మంత్రి మాత్రం మొన్న జూన్‌లో మరో కొత్త బ్యాచ్‌ను ప్రారంభిస్తూ మాయమాటలు చెప్పడం అత్యంత దుర్మార్గమని మండిపడ్డారు.
Also Read
- CP Mahesh Bhagwat: "అదే నా మొదటి ప్రాధాన్యత".. నూతన సీపీ మహేష్ భగవత్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- Harish Rao: కూకట్పల్లి ట్రక్ పార్క్ భూముల వేలంలో పాల్గొనేవారికి హరీష్ రావు వార్నింగ్..
- KTR: తెలంగాణ ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం ఉందా? రాహుల్ గాంధీకి కేటీఆర్ సూటి ప్రశ్న
- Hyderabad: అక్రమ అండాల దందాలో కొత్త కోణం.. వెలుగులోకి షాకింగ్ వ్యవహారం..
వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలి.. సీఐడీ విచారణ జరపాలి
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రెండు లక్షల ఉద్యోగాల హామీ ఏమైందని, జాబ్ క్యాలెండర్ ఎటుపోయిందని రేవంత్ ప్రభుత్వాన్ని హరీష్ రావు నిలదీశారు. ఈ కుంభకోణానికి సంబంధించి ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. టామ్‌కామ్ ద్వారా వసూలు చేసిన ప్రతి పైసాను బాధితులకు వెంటనే వాపస్ ఇవ్వడంతో పాటు, రెండేళ్ల విలువైన కాలం వృథా చేసినందుకు, తెచ్చిన అప్పుల వడ్డీల భారం , మానసిక క్షోభకు గురిచేసినందుకు ఒక్కో అభ్యర్థికి తగిన నష్టపరిహారం చెల్లించాలని కోరారు. మోసపోయిన బాధితులందరికీ ప్రభుత్వం వెంటనే ప్రత్యామ్నాయ ఉద్యోగాలు కల్పించాలని, టామ్‌కామ్ కుంభకోణంపై వెంటనే సీఐడీ లేదా న్యాయ విచారణ జరిపించి బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటివరకు ఎంత ఫీజు వసూలు చేశారు, ఎంతమందికి విదేశీ ఉద్యోగాలు ఇచ్చారనే అంశంపై ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని స్పష్టం చేశారు. నిరుద్యోగ కుటుంబాలకు పూర్తి న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పార్టీ వారి వెంటే ఉండి పోరాటం సాగిస్తుందని హరీష్ రావు హెచ్చరించారు.
తాజావార్తలు
-
Matt Henry: భారత్‌ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!
-
Rohit Sharma Golden Duck: తొలి బంతికే గోల్డెన్ డక్.. ఆ ఇద్దరు అన్నిసార్లా.. భారత బ్యాటర్ల లిస్ట్ ఇదే!
-
Rahul Gandhi vs PM Modi: ప్రధాని మోడీ నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు.. రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు!
-
AP Panchayat Elections 2026: ఏకగ్రీవ పంచాయతీలకు గుడ్‌న్యూస్.. భారీగా పెరిగిన ప్రభుత్వ నజరానా!
-
Big Action Against Zakir Naik: జాకిర్ నాయక్‌కు భారీ షాక్.. IRFపై నిషేధం మరో ఐదేళ్లు పొడిగించిన కేంద్రం!
ట్రెండింగ్
-
NZ vs IND 4th ODI: భారత్ ఖాతాలో చెత్త రికార్డు.. పాకిస్థాన్ సరసన టీమిండియా!
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..!
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?
-
Moringa Soup: ఖరీదైన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వద్దు.. వింటర్లో బుగ్గలపై సహజమైన ఎరుపుదనం తెచ్చే సూప్ ఇదే..
-
Cigarette Prices Hike: ధూమపాన ప్రియులకు షాక్.. మరోసారి సిగరెట్ల ధరల బాదుడు..! ఒక్క ప్యాకెట్‌పై ఏకంగా..