Niki Prasad History: ఔరా నిఖీ ప్రసాద్.. తొలి భారత క్రికెటర్‌గా అరుదైన రికార్డు.. ఇప్పటివరకు ఎవరి వల్ల కాలేదు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Niki Prasad Record: భారత టీ20 క్రికెట్లో యువ స్పిన్నర్ నిఖీ ప్రసాద్ చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో తన కెరీర్లో వేసిన తొలి రెండు బంతులకే రెండు వికెట్లు పడగొట్టి అరుదైన ఘనత సాధించింది. దీంతో పురుషులు, మహిళల టీ20 అంతర్జాతీయ క్రికెట్లో ఈ ఘనత సాధించిన తొలి భారత క్రికెటర్‌గా నిలిచింది. జింబాబ్వేతో రాయ్‌పుర్ వేదికగా ఆదివారం జరిగిన రెండో టీ20లో నిఖీ ఈ రికార్డు నెలకొల్పింది.
2025లో భారత అండర్-19 మహిళల జట్టుకు నాయకత్వం వహించి రెండోసారి ఐసీసీ అండర్-19 మహిళల టీ20 ప్రపంచ కప్‌ను అందించడంలో కీలక పాత్ర పోషించిన నిఖీ ప్రసాద్.. ఇప్పుడు సీనియర్ జట్టులోనూ తన ప్రతిభను చాటుకుంది. జింబాబ్వేతో రెండో టీ20లో రెండు ఓవర్లు బౌలింగ్ చేసి ఏడు పరుగులిచ్చి రెండు వికెట్లు తీసింది. జింబాబ్వే ఇన్నింగ్స్ 15వ ఓవర్లో భారత కెప్టెన్ స్మృతి మంధాన నిఖీకి బంతిని అందించింది. అంతర్జాతీయ టీ20ల్లో తన కెరీర్లో వేసిన తొలి బంతికే చిపో ముగేరి-తిరిపానోను పెవిలియన్‌కు పంపింది. ఆ బంతిని వికెట్ కీపర్ రిచా ఘోష్ అందుకుంది. ఆ తర్వాతి బంతికే న్యాషా గ్వాంజురాను ఎల్బీడబ్ల్యూగా ఔట్ చేసింది. ఇలా వరుసగా తొలి రెండు బంతుల్లోనే రెండు వికెట్లు పడగొట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది.
Also Read
- Chris Gayle Catch: 47 ఏళ్ల వయసులోనూ తగ్గేదేలే.. గాల్లోకి ఎగిరి స్టన్నింగ్ క్యాచ్.. వీడియో చూస్తే మతిపోవాల్సిందే!
- Surya Kumar Yadav: టీమిండియా నుంచి డ్రాప్.. ఆ టోర్నీలో సూర్యకుమార్ విధ్వంసకర ఇన్నింగ్స్..
- WCL 2026 Winner: రెచ్చిపోయిన బ్రావో, వాల్టన్, సిమ్మన్స్.. డబ్ల్యూసీఎల్ టైటిల్ విజేతగా వెస్టిండీస్!
- Bhuvneshwar Kumar: టీమిండియాలోకి రీఎంట్రీ.. భువి మాస్టర్ ప్లాన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
అంతర్జాతీయ టీ20ల్లో తమ కెరీర్లో తొలి బంతికే వికెట్ తీసిన మహిళా బౌలర్ల జాబితాలోనూ నిఖీ ప్రసాద్ పేరు చేరింది. ఈ జాబితాలో క్లోయ్ ట్రయాన్ (2010), అక్షతా రావు (2019), సుహానీ థడానీ (2021) ఉన్నారు. అయితే తొలి రెండు బంతులకే రెండు వికెట్లు పడగొట్టడం అరుదైన ఘనతగా నిలిచింది. ఈ రికార్డుతో నిఖీ ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైఖేల్ కాస్ప్రోవిచ్, అమెరికా మహిళా క్రికెటర్ అక్షతా రావు సరసన నిలిచింది. కాస్ప్రోవిచ్ 2005లో న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో తొలి రెండు బంతుల్లో స్టీఫెన్ ఫ్లెమింగ్, మాథ్యూ సింక్లెయిర్లను ఔట్ చేశాడు. మహిళల టీ20 క్రికెట్లో అక్షతా రావు 2019లో బంగ్లాదేశ్‌పై తొలి రెండు బంతుల్లో అయేషా రెహ్మాన్, సంజిదా ఇస్లామ్‌ల వికెట్లు తీసింది.
ఇక భారత పురుషుల క్రికెట్లోనూ పలువురు ఆటగాళ్లు తమ టీ20 అంతర్జాతీయ కెరీర్లో తొలి బంతికే వికెట్ తీశారు. అజిత్ అగార్కర్ 2006లో హెర్షెల్ గిబ్స్‌ను, ప్రజ్ఞాన్ ఓజా 2009లో షకీబ్ అల్ హసన్‌ను ఔట్ చేశారు. 2011లో విరాట్ కోహ్లీ కూడా కెవిన్ పీటర్సన్‌ను స్టంపింగ్ ద్వారా ఔట్ చేయడంలో భాగమయ్యాడు. అయితే వీరిలో ఎవరూ తమ కెరీర్లో తొలి రెండు బంతుల్లోనే రెండు వికెట్లు పడగొట్టలేదు. నిఖీ ప్రసాద్ అక్టోబర్ 16న రాయ్పుర్లోనే భారత జట్టు తరఫున టీ20 అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసింది. మొదటి టీ20లో ఆమెకు బౌలింగ్ చేసే అవకాశం రాలేదు. అయితే బ్యాటింగ్‌లో మాత్రం 35 బంతుల్లో 39 రన్స్ చేసింది. రెండో మ్యాచ్‌లోనే అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో నిఖీ అరుదైన రికార్డు నెలకొల్పింది.
✌️ in ✌️
That’s how Niki Prasad opened her International wicket tally ✅
Updates ▶️ https://t.co/kECmCQJzty
#TeamIndia | #INDvZIM | @mflone_ https://t.co/wVgHTYJDXa
— BCCI Women (@BCCIWomen) October 18, 2026
తాజావార్తలు
-
Niki Prasad History: ఔరా నిఖీ ప్రసాద్.. తొలి భారత క్రికెటర్‌గా అరుదైన రికార్డు.. ఇప్పటివరకు ఎవరి వల్ల కాలేదు!
-
Mydukur Election Suspended: మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు రద్దు.. ఎస్ఈసీ కీలక ప్రకటన
-
Indian Railways: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. కేవలం 45 పైసలకే రూ.10 లక్షల ఇన్సూరెన్స్..!
-
RAPO 23: టాలీవుడ్లోకి రితీష్ దేశ్ ముఖ్
-
Chris Gayle Catch: 47 ఏళ్ల వయసులోనూ తగ్గేదేలే.. గాల్లోకి ఎగిరి స్టన్నింగ్ క్యాచ్.. వీడియో చూస్తే మతిపోవాల్సిందే!
ట్రెండింగ్
-
Cinnamon Plant: మార్కెట్ దాల్చిన చెక్కకు గుడ్ బై.. ఇంట్లోని కుండీలోనే సులువుగా పెంచేయండిలా..
-
Anaya Bangar: శ్రేయస్‌ను చంపేస్తా.. గిల్‌తో డేటింగ్ చేస్తా.. అభిషేక్‌ను పెళ్లి చేసుకుంటా!
-
Josephine Nkomo: మా ఓటమికి కారణం అదే.. టీమిండియాను చూసి చాలా నేర్చుకోవాలి!
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?