Trap: తెలంగాణకు చెందిన ఆర్మీ అధికారి భార్యకు చైనా ఏజెంట్ల వల
- ఆర్మీ అధికారి భార్యను లక్ష్యంగా చేసుకున్న చైనా ఏజెంట్లు
- పరిశోధకుల ముసుగులో పరిచయం.. ఆపై రక్షణ రంగంపై ఆరా
- ఎన్క్రిప్టెడ్ యాప్‌ల ద్వారా డేటా చేరవేతపై అనుమానాలు
- పలు సెక్షన్ల కింద కేసు.. కొనసాగుతున్న దర్యాప్తు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత సైన్యానికి చెందిన ఓ సీనియర్ ఆర్మీ అధికారి సతీమణిని లక్ష్యంగా చేసుకుని చైనా ఇంటెలిజెన్స్ ఏజెంట్లు పన్నిన కుట్ర వెలుగులోకి వచ్చింది. విద్యావేత్తలు, పరిశోధకుల ముసుగులో ఆమెను వలలోకి లాగిన శత్రు దేశ నిఘా వర్గాలు.. దేశ భద్రతకు సంబంధించిన అత్యంత సున్నితమైన, రహస్య సమాచారాన్ని రాబట్టినట్లు గుర్తించారు. తెలియకుండానే విదేశీ ఏజెంట్ల మాయోపాయంలో చిక్కుకుని వ్యూహాత్మక సమాచారాన్ని చేరవేసిన వ్యవహారంలో జమ్మూకశ్మీర్ పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి దర్యాప్తును తీవ్రతరం చేశారు.
మేధో వలలోకి ఎలా లాగారు?
నిఘా వర్గాల ప్రాథమిక విచారణ ప్రకారం, విదేశీ విశ్వవిద్యాలయాలు , ప్రముఖ పరిశోధనా సంస్థలకు చెందిన ప్రొఫెసర్లు, రీసెర్చర్లుగా చైనా ఏజెంట్లు ఆ మహిళను సంప్రదించారు. మొదటగా పర్యావరణం, అంతర్జాతీయ సంబంధాలు (జియోపాలిటిక్స్) వంటి సాధారణ విషయాలపై ఆమెతో ఆర్టికల్స్ రాయించారు. ఆ తర్వాత క్రమంగా ఆమెను నమ్మిస్తూ దేశ రక్షణ, వ్యూహాత్మక సైనిక అంశాల వైపు రచనలు చేయాల్సిందిగా ప్రోత్సహించారు. ఈ మేధో వల (ఇంటెలెక్చువల్ ట్రాప్)లో క్రమంగా చిక్కుకున్న ఆమె, తాను చేస్తున్నది దేశద్రోహం కిందకు వస్తుందనే విషయాన్ని గుర్తించలేకపోయినట్లు దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి.
Also Read
- Harish Rao : జర్మనీ ఉద్యోగాల పేరుతో మోసమా? టామ్కామ్పై హరీష్ రావు ఫైర్
- Robbery: మాంసం కోసం కారేసుకుని వచ్చారు.. కంటిరెప్ప మూసి తెరిచేలోపే మేకలన్నీ గాయబ్!
- Harish Rao: రెగ్యులర్ బస్సులు తగ్గించి, స్పెషల్ బస్సుల పేరుతో ప్రయాణికుల జేబులకు చిల్లులు పెట్టడం దుర్మార్గం..
- Rangareddy District: ఎంవీఎస్ఆర్ కాలేజీలో ఘోర ప్రమాదం.. లైటింగ్ స్టాండ్ కూలి విద్యార్థిని మృతి
ఎన్క్రిప్టెడ్ యాప్‌ల ద్వారా రహస్య డేటా చేరవేత
తెలంగాణకు చెందిన ఈ మహిళ ప్రస్తుతం జమ్మూలోని గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్నారు. ఆర్మీ ఉన్నతాధికారి భార్య కావడంతో ఆమె వద్ద ఉన్న కొన్ని సున్నితమైన సమాచారాన్ని చైనా ఏజెంట్లు టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. రహస్య పత్రాలు, ఫొటోలు, ఇతర ఎలక్ట్రానిక్ డేటాను ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ యాప్‌ల ద్వారా విదేశీ నిఘా వ్యక్తులకు ఆమె చేరవేసినట్లు పోలీసులు గుర్తించారు. దేశ భద్రతకు భంగం కలిగించేలా వ్యవహరించినందుకు గాను ఆమెపై అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ 1923, భారతీయ న్యాయ సంహిత కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
చైనా ఏజెంట్లు ఆమెను ఏ మార్గాల ద్వారా సంప్రదించారు? ఆర్మీకి సంబంధించి ఎంత మేర కీలక సమాచారం శత్రు దేశాల చేతికి చిక్కింది? అనే కోణంలో కేంద్ర, రాష్ట్ర నిఘా సంస్థలు లోతుగా దర్యాప్తు జరుపుతున్నాయి. దేశ రక్షణ రంగానికి చెందిన కీలక వ్యక్తుల కుటుంబాలను టార్గెట్ చేసి ఇంటెలిజెన్స్ వర్గాలు పన్నుతున్న ఈ తరహా డిజిటల్, మేధోపరమైన కుట్రలు కలకలం రేపుతున్నాయి.
తాజావార్తలు
-
Trap: తెలంగాణకు చెందిన ఆర్మీ అధికారి భార్యకు చైనా ఏజెంట్ల వల
-
Cult Trailer: ఈ రక్తపాతానికి అడ్డు అదుపు లేదా ‘విశ్వక్’?
-
Redmi K100: రెడ్ మీ K100 లాంచ్ ఖాయం.. 10,000mAh బ్యాటరీతో కొత్త ఫోన్!
-
Heroes Turn Villains: విలన్లుగా మారిన స్టార్ హీరోలు.. అసలు ప్లాన్ తెలిస్తే షాకే!
-
Tiger Shroff: బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. బుల్లెట్ తగిలిందా?
ట్రెండింగ్
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!