KA Paul: బెట్టింగ్ యాప్స్ కి ప్రమోషన్ చేసిన రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మీ లాంటి 29 మంది సెలబ్రిటీలపై కేసు నమోదు చేసినందుకు ఈడీకి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బెట్టింగ్ యాప్ లతో కోట్ల మంది యువకుల జీవితాలు నాశనం అయ్యాయని ఆరోపించారు.