పారిస్ ఒలింపిక్స్‌లో భారత జోడీ మను భాకర్, సరబ్జోత్ సింగ్ చరిత్ర సృష్టించారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ షూటింగ్ ఈవెంట్‌లో మను, సరబ్జోత్ కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. కొరియా జోడీని భారత షూటర్లు ఓడించారు. అంతకుముందు ఆదివారం, మను భాకర్ మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ లో కాంస్య పతకాన్ని గెలుచుకున్న విషయం తెలిసిందే. తాజాగా తన ఖాతాలో మరో పతకం యాడ్ అయ్యింది. ఒలింపిక్ పతకాన్ని గెలుచుకున్న మొదటి భారతీయ మహిళా షూటర్‌గా రికార్డ్ సృష్టించిన మను..ఒలింపిక్స్‌లో రెండు పతకాలను గెలుచుకున్న మొదటి క్రీడాకారణిగా మరో చరిత్ర సృష్టించింది.
READ MORE: TS Crime News: సోదరుడిని హత్య చేసి.. మృతదేహాన్ని బైక్‌పై తరలించారు! చివరకు
భారత స్టార్ జోడీ 16-10 తేడాతో దక్షిణ కొరియాకు చెందిన లీ ఒన్హో, ఓ ఏ జిన్‌పై విజయం సాధించింది. భారతదేశానికి ఇది చారిత్రాత్మక ఘట్టం. ఇంతకుముందు ఏ షూటర్ షూటింగ్‌లో రెండు పతకాలు సాధించలేదు. కానీ మను అద్భుతాలు చేసింది. ఈ విధంగా, స్వాతంత్ర్యం తర్వాత ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన తొలి భారతీయ అథ్లెట్‌గా మను భాకర్ నిలిచింది. బ్రిటీష్‌లో జన్మించిన భారత ఆటగాడు నార్మన్ ప్రిచర్డ్ 1900 ఒలింపిక్స్‌లో 200 మీటర్ల స్ప్రింట్, 200 మీటర్ల హర్డిల్స్‌లో రజత పతకాలు సాధించాడు. అయితే ఆ ఘనత స్వాతంత్ర్యానికి ముందే సాధించబడింది.
READ MORE:Sonusood’s birthday: 25 ఏళ్ల క్రితం రూ. 5వేలతో ముంబైకి సోనూసూద్.. ఇప్పుడు వందల కోట్లు!
పతకం సాధించిన అనంతరం సరబ్‌జోత్ సింగ్ మాట్లాడుతూ.. ఇది గర్వించదగ్గ క్షణమని పేర్కొన్నాడు. మేము సంతోషంగా ఉన్నాము. కానీ ఇది కఠినమైన పోరాటం. మరోవైపు మను కోరిక నెరవేరిందన్నాడు. అతని ఆనందం వెల్లివిరిసింది.