Khairatabad Ganesh Nimajjanam: ఖైరతాబాద్ మహా గణపతి శోభాయాత్ర కొనసాగుతుంది. టెలిఫోన్ భవన్ వద్దకు ఖైరతాబాద్ ఘననాధుడు చేరుకున్నాడు. 350 టన్నుల బరువు ఎత్తేలాగ NTR మార్గ్ లో భారీ క్రేన్ ను ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ మార్క్ లో పోలీసులు, జీహెచ్ఎంసీ సిబ్బంది ఉన్న వాహనాలను క్లియర్ చేస్తున్నారు. విగ్రహాల నిమర్జనం ప్రక్రియను ట్రైన్ ఆపరేటర్లు వేగవంత చేస్తున్నారు. ఖైరతాబాద్ సప్తముఖ మహాశక్తి గణపతి నిమజ్జనం కోసం సూపర్ క్రేన్ ను ఏర్పాటు చేశారు. 70 అడుగుల మహాగణపతి విగ్రహం కోసం బాహుబలి క్రేన్ ను సిద్దం చేశారు అధికారులు. 350 టన్నుల బరువు ఎత్తేలా ఎన్టీఆర్ మార్గ్ లో భారీ క్రేన్ ను ఉంచారు. 80 మీటర్ల పొడవు ఉంది. శంషాబాద్ నుంచి క్రేన్ ప్రత్యేకంగా తీసుకొచ్చారు. మధ్యాహ్నం 1 గంట నుంచి మహాగణపతి నిమజ్జనం ప్రక్రియను క్రేన్ సిబ్బంది ఏర్పాట్లు చేస్తున్నారు. మహాశక్తి గణపతి నిమజ్జనం కోసం 14 మంది ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేశారు అధికారులు. ఇందిరా గాంధీ విగ్రహం నుంచి తెలుగు తల్లి ఫ్లై ఓవర్ రూట్ లల్లో ఉన్న 9 క్రేన్ ల వద్ద నిమజ్జనం వేగవంతం చేపట్టారు. అనుకున్న సమయానికి ఖైరతాబాద్ ఘాననాధుడి నిమజ్జనం పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు.
Balapur Ganesh Laddu: అందరి చూపు బాలాపూర్ లడ్డూ వేలం పైనే.. ఈసారి రూ.30 లక్షలు పైమాటే..?