CM Revanth Reddy: ఓ నిజాము పిశాచమా అన్న దాశరథి కవితతో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజాపాలన దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా పబ్లిక్ గార్డెన్ లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జాతీయ జెండా ఎగురవేశారు. తెలంగాణ బానిస సంకెళ్లు తెంచిన చారిత్రాత్మక ఘట్టం 1948 సెప్టెంబర్ 18న ఆవిష్కృతమైందని తెలిపారు. తెలంగాణ అంటే త్యాగం.. దొడ్డి కొమరయ్య లాంటి మంది వీరులు ఎందరో త్యాగం చేశారన్నారు. సెప్టెంబర్ 17 పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయని అన్నారు. కానీ మేము ప్రజా పాలన చేయాలని మేము నిర్ణయించామన్నారు. ఒక ప్రాంతానికో, ఒక కులానికో, ఒక మతానికో వ్యతిరేకంగా జరిగిన పోరాటం కాదు ఇది అని తెలిపారు. ఓ నిజాము పిశాచమా అన్న దాశరథి కవితతో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం ప్రారంభించారు.
Read also: GHMC Office: జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రజాపాలన దినోత్సవ వేడుకలు..
ఒక జాతి తన స్వేచ్ఛ కోసం, ఆత్మగౌరవం కోసం, రాచరిక పోకడపై చేసిన తిరుగుబాటు.. నాటి సాయుధ పోరాటంలో ఎందరో ప్రాణత్యాగాలు చేశారు.. 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు.. ఇది తెలంగాణ ప్రజల విజయం.. ఇందులో రాజకీయాలకు తావులేదు.. సెప్టెంబర్ 17ను కొందరు వివాదాస్పదం చేయడం క్షమించరానిదని తెలిపారు. ఢిల్లీకి పోతే కూడా కొందరు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ఢిల్లీ పాకిస్థాన్ లో ఉందా..? అని ప్రశ్నించారు. వ్యక్తిగత పనుల కోసం ఢిల్లీ వెళ్ళడం లేదన్నారు రాష్ట్ర హక్కుల కోసం.. ఎన్ని సార్లైనా ఢిల్లీకి పోతాం.. లేక్ సిటీ కాస్త.. డ్రగ్స్ సిటిగా మార్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెరువుల రక్షణకు హైడ్రాను తీసుకొచ్చామన్నారు. ప్రకృతి విపత్తు రాకుండా చూడాలన్నారు. హైడ్రా వెనకాల రాజకీయం లేదని తెలిపారు. కొందరు హైడ్రానీ నీరుకార్చే పనిలో ఉన్నారని మండిపడ్డారు. ఎవరు అడ్డుకున్నా ఆగదు హైడ్రా.. ప్రజలు సహకరించాలని కోరారు.
Bandlaguda Jagir: ఏకంగా రూ.1.87 కోట్లు పలికిన బండ్లగూడ గణేష్ లడ్డూ..!