Balapur Ganesh Laddu: గతేడాది రూ.27 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డూ.. ఈసారి ఎంత ధర పలుకుతుందనే ఉత్కంఠకు తెరపడింది. భాగ్యనగరంలోని బాలాపూర్ లడ్డూను కొలను శంకర్ రెడ్డి దక్కించుకున్నారు. వేలం పాటలో రూ.30 లక్షల 1 వెయ్యికి గాను బాలాపూర్ గణేశుడి లడ్డూను కొలను శంకర్ రెడ్డి కైవసం చేసుకున్నారు. ప్రతి సంవత్సరం బాలాపూర్ లడ్డూ వేలంలో రికార్డు ధర పలుకుతోంది. అందుకే భక్తుల కొంగుబంగారంగా నిలిచిన గణనాథుడి లడ్డూ వేలం పాట కోసం జనాలు ఆసక్తిగా ఎదురుచూశారు. ఊరేగింపు అనంతరం గ్రామ బొడ్రాయి వద్ద లడ్డూ వేలంపాట మొదలు పెట్టారు. గతేడాది 27 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డూలు ఈసారి ఏకంగా.. మూడు లక్షల వెయ్యి రూపాయలు పెరిగింది. అంటే.. గతేడాది రూ.రూ.27 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డూను ఈ ఏడాది ఏకంగా.. రూ. 30 లక్షల 1 వెయ్యికి గాను బాలాపూర్ గణేశుడి లడ్డూను కొలను శంకర్ రెడ్డి కుటుంబం కైవసం చేసుకుంది.