DCP Narasimha: బజాజ్ ఎలక్ట్రానిక్స్‌ను టార్గెట్ గా యూపీఐ మోసాలపై సైబరాబాద్ డీసీపీ నరసింహ ఉక్కుపాదం మోపారు. పక్కా సమాచారంతో యూపీఐ మోసాలకు పాల్పడుతున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు. నాలుగు కోట్ల రూపాయల మోసాలకు పాల్పడిన రాజస్థాన్ కు చెందిన 13 మంది నిందితులను అదుపులో తీసుకున్నారు. నిందితుల నుండి 1.72 లక్షల నగదు, 50 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. శంషాబాద్ సిసిఎస్, కేపీహెచ్బీ, మాదాపూర్, నార్సింగి పోలీసులు సంయుక్త ఆపరేషన్ నిర్వహించి నిందితులను పట్టుకున్నామని సైబరాబాద్ డీసీపీ నరసింహ తెలిపారు. హైటెక్ యూపీఐ మోసాలకు పాల్పడుతున్న నిందితులను అదుపులో తీసుకున్నామని తెలిపారు.
Read also: Kalki Vinayakudu: కాంప్లెక్స్‌ను పోలిన మందిరం.. అశ్వత్థామగా వినాయకుడు! వీడియో వైరల్
సైబరాబాద్ డీసీపీ నరసింహ మాట్లాడుతూ.. బజాజ్ ఎలక్ట్రానిక్స్‌ను టార్గెట్గా చేసుకొని యూపీఐ మోసాలకు పాల్పడిన రాజస్థాన్ ముఠాను అదుపులో తీసుకున్నామన్నారు. మూడు కమిషనరేట్లతోపాటు తెలంగాణ వ్యాప్తంగా సుమారు నాలుగు కోట్ల రూపాయల యూపీఐ మోసాలకు ఈ ముఠా పాల్పడుతుంది. బజాజ్ ఎలక్ట్రానిక్స్ పిర్యాదు మేరకు ప్రత్యేక టీం ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టామని, ముందుగా వస్తువులు కొనడానికి ఎలక్ట్రానిక్స్ షోరూం లోకి రాజస్థానీ ముఠాలోని సభ్యులు వెళ్తారని ఆతరువాత.. విలువైన వస్తువులు కొనుగోలు చేశాక యూపీఐ ద్వారా చెల్లింపులు చేస్తారన్నారు. యూపీఐ ద్వారా చెల్లింపులు చేయడానికి బజాజ్ షోరూమ్ లోని క్యూఆర్ కోడ్‌ను రాజస్థాన్లోని సహచరులకు ఈ ముఠా సభ్యులు పంపుతున్నారని తెలిపారు. ఆ తరువాత అక్కడి నుండి క్యూఆర్ కోడ్ తో రాజస్థాన్లోని సహచర ముఠా సభ్యులు పంపుతున్నారని తెలిపారు.
Read also: Errabelli Dayakar Rao: మూడు స్థానాల్లో మళ్ళీ బై ఎలక్షన్ రావడం ఖాయం.. ఎర్రబెల్లి హాట్ కామెంట్స్
ఎలక్ట్రానిక్ వస్తువులు డెలివరీ అయ్యాక పొరపాటున వేరే ఖాతాకు డబ్బు బదిలీ చేశామంటూ చార్జ్ బ్యాక్ ఆప్షన్ ద్వారా తిరిగి డబ్బు పొందుతున్నారని అన్నారు. రాజస్థాన్ కు చెందిన 20 నుండి 25 ఏళ్ల వయసు ఉన్న యువకులంతా కలిసి ముఠాగా ఏర్పడ్డారని వెల్లడించారు. యూపీఐ మోసాల ద్వారా కొనుగోలు చేసిన ఎలక్ట్రానిక్ వస్తువులను ఇతరులకు అమ్మి ఈ ముఠా సొమ్ము చేసుకుంటుందన్నారు. గత రెండు నెలలుగా 1125 యూపీఐ ట్రాన్స్‌యాక్షన్స్ చేశారన్నారు. ఈ ముఠాకు చెందిన వారిలో హైదరాబాద్ కు చెందిన 13 మందిని పట్టుకున్నామన్నారు. రాజస్థాన్ కు ప్రత్యేక టీమ్ లను పంపిస్తున్నామని తెలిపారు. ఈ క్రైమ్ వెనకాల ఉన్న కింగ్ పిన్ ను పట్టుకుంటామని అన్నారు. ఈ యూపీఐ మోసాల వెనుక ఆర్గనైజ్డ్ క్రైమ్ ఉందని డీసీపి నరసింహ అనుమానం వ్యక్తం చేశారు.
Malla Reddy: నేను పార్టీ మారలేదు.. సమయం వచ్చినప్పుడు చెబుతా..