Errabelli Dayakar Rao: మూడు స్థానాల్లో మళ్ళీ బై ఎలక్షన్ రావడం ఖాయం.. మాజీ మంత్రి ఎర్రబెల్లి హాట్ కామెంట్స్ చేశారు. జనగామ జిల్లాలో ఆయన మాట్లాడుతూ.. పార్టీ మారిన ఎమ్మెల్యేల పై హై కోర్టు ఇచ్చిన కీలక ఆదేశాలపై ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై హై కోర్టు నాలుగు వారాలలో చర్యలు తీసుకోవాలని స్పీకర్ కి ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు. నాలుగు వారాలలో చర్యలు తీసుకోకపోతే తామే సుమోటోగా తీసుకుని చర్యలు తీసుకోవాల్సివస్తుందని హై కోర్టుక తెలిపిందన్నారు. మూడు స్థానాల్లో మళ్ళీ బై ఎలక్షన్ రావడం ఖాయమని కీలక వ్యాఖ్యలు చేశారు. అత్యధిక మెజారిటీతో బీఆర్ఎస్ పార్టీ గెలవడం ఖాయమని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Read also: Bandi Sanjay: నేను హైడ్రాకి సపోర్ట్ చేశా.. ఇప్పుడు విశ్వాసం పోతుంది..
పార్టీ మారిన ఎమ్మెల్యేలకు తెలంగాణ హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. నేడు పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై హైకోర్టు తీర్పు వెలువరించింది. అనర్హత పిటిషన్లు స్పీకర్ ముందు ఉంచాలని అసెంబ్లీ సెక్రటరీకి హైకోర్టు ఆదేశించింది. ఎప్పటి వరకు వాదనలు వినాలి, ఎప్పటిలోగా ప్రొసీడింగ్స్ పూర్తి చేయాలన్న దానిపై షెడ్యూల్ విడుదలకు హైకోర్టు ఆదేశించింది. నాలుగు వారాల్లో స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలని హైకోర్టు కోరింది. నాలుగు వారాల్లో షెడ్యూల్ విడుదల చేయకపోతే సుమోటోగా విచారణ జరుపుతామని హైకోర్టు తెలిపింది. పిటిషన్ల విచారణపై షెడ్యూల్ రిలీజ్ చేయాలని హైకోర్టు ఆదేశించింది. కాగా, బీఆర్‌ఎస్ బీ-ఫారంపై ఎమ్మెల్యేలుగా గెలిచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన ముగ్గురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు సోమవారం వాదనలు ముగించింది. అయితే.. కోర్టు తీర్పుతో బీఆర్ఎస్‌లో గెలిచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన ఎమ్మెల్యేలలో టెన్షన్ మొదలైంది.
ఎమ్మెల్యేలు వీరే..
* దానం నాగేందర్ – ఖైరతాబాద్
* ప్రకాష్ గౌడ్ – రాజేంద్రనగర్
* గూడెం మహిపాల్ రెడ్డి – పటాన్ చెరు
* కాలె యాదయ్య – చేవెళ్ల
* అరికెపూడి గాంధీ – శేరిలింగంపల్లి
* బండ్ల కృష్ణమోహన్ రెడ్డి – గద్వాల్
* ఎం సంజయ్ కుమార్ – జగిత్యాల
* పోచారం శ్రీనివాస్ రెడ్డి – బాన్సువాడ
* తెల్లం వెంకట్రావు – భద్రాచలం
* కడియం శ్రీహరి – స్టేషన్ ఘన్‌పూర్
Kolkata Murder Case : కోల్ కతా డాక్టర్ ఘటనపై సుప్రీంకోర్టులో విచారణ.. వచ్చే మంగళవారానికి వాయిదా