Kalki Vinayakudu: కాంప్లెక్స్‌ను పోలిన మందిరం.. అశ్వత్థామగా వినాయకుడు! వీడియో వైరల్
- దేశవ్యాప్తంగా ఘనంగా వినాయక చవితి వేడుకలు
- భక్తులను ఆకర్షిస్తున్న అశ్వత్థామ వినాయకుడు
- కల్కి సెట్‌లా వినాయక మందిరం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kalki Ganesh in Tamil Nadu: దేశవ్యాప్తంగా వినాయక చవితి 2024 వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ‘గణపతి బప్పా మోరియా’ నినాదాలతో పట్టణం, గ్రామాల్లోని ప్రతి గల్లీ హోరెత్తిపోతోంది. చవితి వేడుకల సందర్భంగా బొజ్జ గణపయ్య పలు రూపాల్లో దర్శనమిచ్చాడు. ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్లుగా ఉన్న కొన్ని వినాయకుడి విగ్రహాలు భక్తులను ఆకర్షిస్తున్నాయి. అన్నికంటే ముఖ్యంగా ‘కల్కి’ వినాయకుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాడు. గతంలో బాహుబలి, పుష్ప వినాయక విగ్రహాలు ఆకట్టుకున్న విషయం తెలిసిందే.
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ‘కల్కి 2898 ఏడీ’ ప్రపంచవ్యాప్తంగా బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టింది. ఇందులో భైరవ పాత్రలో ప్రభాస్, అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్, సుప్రీమ్ యాస్కిన్‌గా కమల్‌హాసన్ మెప్పించారు. బుజ్జి వెహికల్ సహా కంప్లెక్స్ కూడా అందరినీ ఆకట్టుకున్నాయి. కల్కి మేనియా నేపథ్యంలో తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో కల్కి సెట్‌లా వినాయక మందిరం వేశారు. అచ్చం కాంప్లెక్స్‌ను పోలిన మందిరం, అశ్వత్థామగా వినాయకుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Also Read
Also Read: Rishabh Pant: ఎవరైనా అలా చెయ్.. ఇలా చెయ్‌మని చెబితే నచ్చదు: పంత్
కల్కి సినిమాలో మాదిరి కాంప్లెక్స్‌లో నుంచి లోపలికి వెళ్లేలా వినాయక మందిరంను డిజైన్ చేశారు. మందిరం లోపల సుప్రీమ్ యాస్కిన్ బొమ్మ, శివుడి విగ్రహం, అశ్వత్థామగా వినాయకుడిని ఏర్పాటు చేశారు. ఇది చూడ్డానికి అద్భుతంగా ఉంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ అశ్వత్థామ వినాయకుడిని చూసేందుకు భక్తులు ఎగబడుతున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలు ఈ వినాయక మందిరంను చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు.
The craze of #Kalki2898AD!💥
In a remarkable setup at #Denkanikottai for #GaneshChaturthi celebrations, an idol of Lord Vinayaka is depicted as Ashwatthama, accompanied by Supreme Yaskin and Bujji 🤩👌#Prabhas pic.twitter.com/KH8J2DoRb6
— Suresh PRO (@SureshPRO_) September 9, 2024
తాజావార్తలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
-
Karnataka: హృదయ విదారక ఘటన.. తల్లి శవంపై ఏడుస్తూ కనిపించిన రెండేళ్ల చిన్నారి
-
OTR: కాంగ్రెస్ కంచుకోటలో గ్రూప్ వార్.. క్యాడర్లో పెరుగుతున్న అసంతృప్తి..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!