Suicide : హైదరాబాద్ మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దుర్గం చెరువులో ఓ యువతి మృతదేహం లభ్యమైంది. ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది. పోలీసులు ప్రాథమికంగా ఇది ఆత్మహత్యగా అనుమానిస్తున్నారు. బాధితురాలిని సుష్మ (27)గా గుర్తించారు. ఈ రోజు తెల్లవారుఝామున 4 గంటలకు బొట్టు అంజయ్య అనే వ్యక్తి మిస్సింగ్ కంప్లైంట్‌ను మాదాపూర్ పోలీసులకు ఇచ్చారు. “ఆఫీస్‌కు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లిన సుష్మ తిరిగి రాకపోవడంతో ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు.…