Warning to farmers: తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. విత్తనాలు వేసేవారికి కొద్ది రోజులు ఆగాలనీ సూచించింది. ఇప్పట్లో విత్తనాలు వేయకూడదని హెచ్చిరికలు జారీ చేసింది. జూన్ నెల ప్రారంభం కాగానే వాతావరణంలో మార్పులు వచ్చి వాతావరణం చల్లబడుతుంది. కానీ జూన్ నెల ప్రారంభమై మూడు రోజులు గడుస్తున్నా.. ఎండలు ఇంకా మండుతూనే ఉన్నాయి. కొన్ని జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. భారీ వర్షాలు, వడగళ్ల వానలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం కావడమే ఇందుకు కారణమని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు చెబుతున్నారు. ఏటా జూన్ మొదటి వారంలో కేరళను తాకే నైరుతి రుతుపవనాలు ఈసారి జూన్ రెండో వారంలో వచ్చే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. రుతుపవనాలు ప్రవేశిస్తే ఎండలు తగ్గే అవకాశం ఉందని అంటున్నారు.
Read also: Bandi sanjay: పాలనపై వాస్తవాలు ప్రజల ముందుంచాలి.. సీఎంకు బండి సంజయ్ లేఖ
గత రెండేళ్లతో పోలిస్తే ఈ ఏడాది రాష్ట్రానికి రుతుపవనాలు కాస్త ఆలస్యంగా వస్తున్నాయి. 2021లో, నైరుతి రుతుపవనాలు మే చివరి నాటికి కేరళను తాకనున్నాయి. జూన్ మొదటి వారంలో తెలంగాణలో భారీ వర్షాలు కురిశాయి. ఇక 2022లో నైరుతి రుతుపవనాలు మే 29న కేరళను తాకనున్నాయి.అవి జూన్ 8న రాష్ట్రానికి చేరుకున్నాయి.దీంతో తెలంగాణలో సాధారణ వర్షపాతం కంటే 50 శాతం ఎక్కువ వర్షం కురిసింది. 2021లో తెలంగాణలో 111.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 2022 సీజన్‌లో 109.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. విస్తారంగా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలోని చెరువులు జలకళను సంతరించుకున్నాయి. అయితే ఈ రెండు సీజన్లతో పోలిస్తే ఈసారి నైరుతి రుతుపవనాలు ఐదు రోజులు ఆలస్యంగా రాష్ట్రాన్ని తాకనున్నాయని వాతావరణ శాఖ అధికారులు భావిస్తున్నారు.
Read also: Odisha Train Accident: బాధితుల ఆర్తనాదాలు.. రక్తదానం చేసేందుకు ముందుకొస్తున్న యువత..
నేడు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడిస్తున్నారు. పశ్చిమ విదర్భ నుంచి మరఠ్వాడా, ఉత్తర కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి ఏర్పడింది. ఇది స్థిరంగా కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ద్రోణి ద్రోణి ప్రభావంతో ఈరోజు అక్కడక్కడా వర్షాలు కురుస్తాయి. కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. చిన్నపాటి జల్లుల కారణంగా రైతులు పంట వేయవద్దని సూచించారు. ఇది ఇలా ఉండగా ఈ ఏడాది వాతావరణం భిన్నంగా ఉందనే చెప్పాలి. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో అకాల వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో వడగళ్ల వాన కారణంగా వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి.
Pushpa 2: భారీగా జరగనున్న పుష్ప 2 బిజినెస్..!!