అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వం లో రూపొందుతున్న పుష్ప 2 సినిమా షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే సినిమా అక్టోబర్ వరకు షూటింగ్ పూర్తి చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి అంటూ సమాచారం అందుతుంది.మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తో ఈ సినిమాని రూపొందిస్తున్నారని తెలుస్తుంది.. మొదటి భాగం దాదాపుగా 400 కోట్ల రూపాయల కలెక్షన్స్ ని రాబట్టిన కారణంగా రెండవ భాగం బడ్జెట్ విషయం లో మైత్రి మూవీ మేకర్స్ అస్సలు ఆలోచించడం లేదని తెలుస్తుంది.. ఇప్పటికే 200 కోట్ల రూపాయల బడ్జెట్ ని ఖర్చు చేశారని.. మరో 150 నుండి 200 కోట్ల రూపాయలను ఖర్చు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి అంటూ సమాచారం అందుతుంది. అన్ని అనుకున్నట్లుగా జరిగితే పుష్ప 2 సినిమా ఈ ఏడాది చివర్లోనే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా యొక్క బిజినెస్ లెక్కలు అభిమానులు ఊహించినంత గా అయితే ఉండబోతున్నాయి అంటూ టాక్ వినిపిస్తుంది. ఫ్రీ రిలీజ్ బిజినెస్ దాదాపుగా 500 కోట్ల రూపాయలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి.
ఈ మధ్య కాలంలో రూ. 500 కోట్ల కలెక్షన్స్ అనేది చాలా కామన్ గా అయితే చూస్తూ ఉన్నాం. పుష్ప 2 సినిమా వేయి కోట్ల కలెక్షన్స్ టార్గెట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తుంది..సినిమా యొక్క ఫ్రీ రిలీజ్ బిజినెస్ రూ. 500 కోట్లు ఉండడం పెద్ద ఆశ్చర్యకర విషయం అయితే కాదు అంటూ కొందరు వారి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా లో ప్రస్తుతానికి సినిమా యొక్క హడావుడి అయితే లేదు.. అయినా కూడా ఈ స్థాయి బిజినెస్ జరగబోతోంది అని చర్చ మాత్రం జరగడం నిజంగా గొప్ప విషయం అని చెప్పవచ్చు.. సినిమా విడుదలకు రెండు మూడు నెలల నుండి అసలు అయిన హడావుడి మొదలు అవుతుంది.. అప్పుడు సినిమా యొక్క బడ్జెట్ కి తగ్గట్లుగా భారీ ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం అనుకుంటున్న మొత్తం తో పోలిస్తే మరింత ఎక్కువగా అప్పుడు బిజినెస్ జరిగే అవకాశాలు ఉన్నాయి.