తెలంగాణలోకి బుతుపవనాలు ఎంట్రీ ఇచ్చాయి.. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ చెబుతోంది.. మొన్న రాత్రి రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురవగా.. మంగళవారం పరిస్థితి భిన్నంగా ఉంది.. పగటిపూట ఉష్ణోగ్రతలు మళ్లీ పెరిగిపోయాయి.. అయితే, రాత్రి నుంచి మళ్లీ పరిస్థితి మారిపోయింది.. అక్కడక్క వర్షం కురిసింది.. మరోవైపు, ఇక నుంచి వర్షాలు దంచికొట్టే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఉదయం నుంచే హైదరాబాద్ సహా రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.
Read Also: Astrology: జూన్ 15 బుధవారం దినఫలాలు
రాష్ట్రంలో ఇవాళ, రేపు కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.. అక్కడ ఓ మోస్తరు వర్షాలు.. కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుసే అవకాశం ఉందని వెల్లడించింది. ఇక, రానున్న మూడు రోజుల పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది.. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించినా.. వాటి కదలిక మందకొడిగా ఉన్నట్టుగా కనబడుతోంది.. అయితే, 2 నుంచి 3 రోజుల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు విస్తరిస్తాయని.. వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది.