Hyderabad Police Arrested A Man Who Selling Dangerous Steroids: హైదరాబాద్‌లోని సనత్ నగర్, ఫతే నగర్ ప్రాంతాల్లో జిమ్ ట్రైనర్లకు అక్రమంగా నార్కొటిక్ డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ వ్యక్తి పేరు హరి సేనాపతి. ఒరిస్సాకు చెందిన హరి.. బంజారాహిల్స్‌లో ‘హెల్త్ అండ్ వెల్‌నెస్’ పేరుతో ప్రోటీన్ ప్రోడక్ట్స్ అమ్మే షాప్ నిర్వహిస్తున్నాడు. ఈ షాప్ ముసుగులో అతడు హానికారక స్టెరాయిడ్స్‌ని అమ్ముతున్నాడు. ఇతనికి ఫేస్‌బుక్ ద్వారా చెన్నైకి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. శ్రీనివాస్ వద్ద నుంచి స్టెరాయిడ్స్ కొనుగోలు చేసి, హైదరాబాద్‌లో జిమ్ ట్రైనర్లకు అమ్ముతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే రంగంలోకి దిగిన సనత్ నగర్ పోలీసులు.. హరి సేనాపతిని అరెస్ట్ చేశారు. అతని వద్ద 33 రకాల ఇంజెక్షన్లు, ట్యాబ్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. అయితే.. శ్రీనివాస్ మాత్రం పరారీలో ఉన్నాడు.
Adipurush: ప్రమోషన్స్ చేయకుండానే బాలీవుడ్ దుమ్మురేపుతున్న ‘ఆది పురుష్’.. అరచాకం అంటే ఇదే!
ఈ కేసు గురించి డీసీపీ జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. మెఫెంటరమైన్ సల్ఫేట్ ఇంజెక్షన్లను ఉన్న హరి సేనాపతిని తాము అరెస్ట్ చేశామన్నారు. అతని వద్ద ఉన్న 288 ఇంజెక్షన్లను తాము సీజ్ చేశామని, వీటిని మార్కెట్లో రూ.1000 నుండి రూ.1400కు అమ్ముతున్నారని తెలిపారు. ఈ ఇంజెక్షన్లను వైద్యులు ఆపరేషన్ థియేటర్లలో వినియోగిస్తారని.. బీపి లెవెల్స్ తక్కువగా ఉన్నప్పుడు పెంచడానికి ఈ ఇంజెక్షన్ వాడతారని వివరించారు. అయితే.. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మేరకు వీటిని వినియోగించాల్సి ఉంటుందన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన అహ్మద్ ఖురేషి పరారీలో ఉన్నాడన్నారు. జిమ్‌లో ఎక్సర్‌సైజ్ చేసే వాళ్లు త్వరగా అలసిపోతారని, అలాంటి సమయంలో ఈ ఇంజెక్షన్ తీసుకుంటే మరో గంటకు పైగా ఎక్సర్‌సైజ్ చేసే అవకాశం ఉంటుందన్నారు. ఈ ఇంజెక్షన్ తీసుకుంటే స్టామినా పెరుగుతుందన్న ఉద్దేశంతో.. జిమ్ చేసే వాళ్లు చాలామంది దీన్ని వినియోగిస్తున్నారని పేర్కొన్నారు.
Police Drags Bride: పెళ్లిలో ఊహించని ట్విస్ట్.. పీటలపై నుంచి వధువుని లాక్కెళ్లిన పోలీసులు
కానీ.. ఇలాంటి ఇంజెక్షన్లు తీసుకోవడం వల్ల చాలామంది అనారోగ్య బారిన పడుతున్నారని, చిన్న వయసులోనే ప్రాణాలు కూడా కోల్పోతారని డీసీపీ వెల్లడించారు. కొరియర్ ద్వారా ఈ ఇంజెక్షన్లను ఢిల్లీ నుండి తెప్పిస్తున్నట్టు తమ విచారణలో తేలిందన్నారు. ఇంకా ఇలాంటి ఇంజెక్షన్లను ఎవరు, ఎక్కడి నుండి తీసుకొస్తున్నారు? అనే వివరాల్ని సేకరిస్తున్నామన్నారు. అలాంటి వారిపై కూడా కేసులు నమోదు చేస్తామన్నారు.