Kerala Police Drags Away Bride Minutes Before Marriage: కేరళలోని ఓ వివాహ వేడుకలో ఎవ్వరూ ఊహించని ఓ సంఘటన చోటు చేసుకుంది. వధువు మెడలో వరుడు సరిగ్గా తాళి కట్టే సమయంలో.. పోలీసులు ఎంట్రీ ఇచ్చి, ఆ పెళ్లిని ఆపేశారు. అంతేకాదు.. వధువుని పీటలపై నుంచి బలవంతంగా లాక్కెళ్లారు. ఆమెను కోర్టులో హాజరుపరిచారు. అంతలా ఆ వధువు ఏం చేసింది? పోలీసులు ఎందుకని ఈ పెళ్లి ఆపేశారు? ఆ వివరాల్లోకి వెళ్తే.. కోవలం ప్రాంతానికి చెందిన అల్ఫియా అనే అమ్మాయి అఖిల్ అనే అబ్బాయిని ప్రేమించింది. అయితే.. మతాలు వేరు కావడంతో, అల్ఫియా కుటుంబసభ్యులు వారి బంధాన్ని అంగీకరించలేదు. కానీ.. వాళ్లిద్దరు ఒకరిని విడిచి మరొకరు ఉండలేకపోయారు. దీంతో.. ఇంట్లో నుంచి వెళ్లిపోయి, పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. ప్లాన్ ప్రకారం.. ఆదివారం ఓ స్థానిక ఆలయంలో పెళ్లి ఏర్పాటు చేసుకున్నారు.
సరిగ్గా అల్ఫియా మెడలో అఖిల్ తాళి కట్టబోతుండగా.. పోలీసులు సడెన్ ఎంట్రీ ఇచ్చి, ఈ పెళ్లిని ఆపేశారు. అల్ఫియాను అక్కడి నుంచి బలవంతంగా పోలీస్‌స్టేషన్‌ను తీసుకొచ్చారు. తాను రానని అల్ఫియా అరుస్తున్నా, అఖిల్ పోలీసుల్ని అడ్డుకోవడానికి ప్రయత్నించినా.. ఫలితం లేకుండా పోయింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్ కూడా అయ్యాయి. ఈ ఘటనపై ఓ పోలీస్ అధికారి మాట్లాడుతూ.. అల్ఫియా కనిపించకుండా పోయిందని ఆమె కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారని, దాంతో తాము దర్యాప్తు చేపట్టామని తెలిపారు. ఓ ఆలయంలో అల్ఫియా పెళ్లి చేసుకుంటోందని తెలిసి, అక్కడికి వెళ్లామని చెప్పారు. కోర్టు ఆదేశాల మేరకు.. అల్ఫియాను న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టామని చెప్పారు. అయితే.. తాను అఖిల్‌తోనే వెళ్తానని, అతడినే పెళ్లి చేసుకుంటానని అల్ఫియా చెప్పడంతో.. కోర్టు అందుకు అంగీకరించిందని, దాంతో వాళ్లిద్దరు అక్కడి నుంచి వెళ్లిపోయారని వివరించారు.
Bullet Train Start: ఢిల్లీ నుండి ఈ మూడు నగరాలకు బుల్లెట్ రైలు.. ఛార్జీలు ఎంతంటే?
ఈ వ్యవహారంపై అల్పియా, అఖిల్ కూడా మీడియాతో మాట్లాడారు. అఖిల్‌తో కలిసి జీవించడం తన పేరెంట్స్‌కి ఇష్టం లేదని, తనని బలవంతంగా తీసుకెళ్లాలని వారు ప్రయత్నించారని, అందుకే తాను కనిపించడం లేదంటూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని అల్ఫియా వివరించింది. కానీ, తాను ఇష్టపూర్వకంగానే అఖిల్‌తో వెళ్లానని కోర్టులో చెప్పడంతో, వాళ్లు తమని వెళ్లనిచ్చారని చెప్పింది. అయితే.. పోలీసులు తమ పట్ల అమానుషంగా ప్రవర్తించారని, అల్ఫియాను బలవంతంగా లాక్కెడమే కాక తనని తోసేశారంటూ అఖిల్ ఆరోపించాడు.