Atrocious: మహిళ సామాన్యంగా గర్భవతి అయిందంటే చాలు కడుపులో ఉంది మగ బిడ్డా లేక ఆడబిడ్డ అని తెలుసుకోవాలని ఆత్రంగా ఉంటారు. అయితే.. మనదేశంలో లింగ నిర్ధారణ పరీక్ష నిషేధం. కానీ.. కొందరు అడ్డదారిలో కడుపులో ఉంది ఆడబిడ్డ.. మగ బిడ్డ తెలుసుకొని పొరపాటున జన్మించబోయేది ఆడబిడ్డని తెలిస్తే వెంటనే అబార్షన్ చేయించిన సందర్భాలున్నాయి. అయితే.. అలా తెలుసుకోలేని వారు జన్మించిన అనంతరం మగ బిడ్డ అయితే ఉంచుకొని ఆడబిడ్డ అయితే చెత్త కుప్పల్లో.. పొదల్లో పడేసి పోతుంటారు కొంతమంది దౌర్భాగ్యులు. ఇటువంటి సమాజంలో ఉంటున్నాం మనం.. అయితే ఓ ప్రబుద్దుడు చేసిన ఆగడాలకు అడ్డు అదుపులేకుండా పోయింది. ఆడపిల్లలు పుడుతున్నారని తన భార్యకు నాలుగు సార్లు అబర్షన్ చేయించడమే కాకుండా.. తన భార్య చనిపోయిందని రెండో పెళ్లి చేసుకున్న ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది.
Read also: Niti Aayog : బంజరు ప్రాంతాలలో పచ్చదనం… ఇస్రో, నీతి ఆయోగ్ సంయుక్త ప్రణాళిక
హైదరాబాద్‌లో నిత్య పెళ్లి కొడుకుల ఆగడాలు వెలుగు చూశాయి. బతికుండగానే భార్య చనిపోవడంతో అమరేందర్ అనే వ్యక్తి మరో పెళ్లి చేసుకున్నాడు. అమరేందర్ హైకోర్ట అడ్వకేట్ గా గుర్తించారు. అమరేందర్ తండ్రి మహేందర్ రిటైర్డ్ జడ్జిగా పోలీసులు గుర్తించారు. వంశాభివృద్ధి కోసం మగపిల్లాడు లేడంటూ రెండో పెళ్ళి చేసుకున్నాడని పోలీసులు గుర్తించారు. అమరేందర్ భార్య పదే పదే ఆడపిల్లలకు జన్మనిస్తుందని తెలుసుకుని, ఆమెకు బలవంతంగా నాలుగుసార్లు అబార్షన్ చేయించాడని పోలీసులు తెలిపారు. వీరికి ఇప్పటికే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. లింగనిర్ధారణ పరీక్షలు నేరమైనప్పటికీ అక్రమంగా స్కానింగ్ చేసి ఆడపిల్ల పుట్టబోతోందని గుర్తించిన అమరేందర్ 4 సార్లు అబార్షన్లు చేయించుకున్నట్లు తేలింది. అయితే ఆమెకు ఏ డాక్టర్ అబార్షన్ చేశాడు? లేక మాత్రలు ఎక్కడ వేసుకున్నాడు? అమరేందర్ తన భార్యకు అబార్షన్ చేయించడానికి ఎవరు సహకరించారనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. రాజకీయాల్లో జోక్యం కూడా ఉందన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ బీఆర్‌ఎస్ పార్టీగా మారిన తర్వాత అమరేందర్ తెలంగాణ రైతు రాజ్య సమితి (టీఆర్‌ఎస్) పేరుతో పార్టీని రిజిస్టర్ చేయించుకున్నాడు.
ఇప్పటికే అమరేందర్ పై సరూర్ నగర్ మహిళా పీఎస్ లో కేసు నమోదైంది. అమరేందర్ బారినపడ్డ పలువురు బాధితులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తనకు న్యాయం చేయాలంటూ బాధితులు, అమరేందర్ భార్య వేడుకుంటున్నారు. అప్పటికే నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నాడని అమరేందర్ చెప్పాడని భార్య వాపోయింది. నాలుగుసార్లు అమ్మాయిలని చెప్పి తనకు అబార్షన్లు చేపించాడని కన్నీరుమున్నీరయ్యింది. తనకు తెలియకుండా గతేడాది నవంబర్ లో సిద్ధిపేటలో రెండో పెళ్ళి చేసుకున్నాడని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆడపిల్లలు పుట్టారని తనని వదిలించుకోవాలని చూస్తున్నారని, తనకు పిల్లలకు న్యాయం చేయాలని పోలీసులకు వేడుకుంది.
Thummala Nageswara Rao: అన్నం పెట్టే రైతులను కేంద్రం ఆదుకోవాలి.. లేదంటే మీకే నష్టం..