HYDRA : హైదరాబాద్ నగర అభివృద్ధిలో భాగంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ బోరబండ, గచ్చిబౌలి, వనస్థలిపురం, బడంగిపేట తదితర ప్రాంతాల్లో నాళాలు, చెరువుల పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా పలు కీలక ఆదేశాలు, సూచనలు చేసిన ఆయన… అవసరమైన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
బోరబండ హైటెన్షన్ రోడ్ విస్తరణ పనులపై కమిషనర్ ప్రత్యేక దృష్టి సారించారు. నాలాల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని, మురుగు నీరు వరద నీటిలో కలిసిపోకుండా కిందకి పోవేలా drainage వ్యవస్థను నిర్మించాలని సూచించారు. అలానే బోరబండను అల్లాపూర్‌తో కలుపుతూ సాగే నాలాను విస్తరించాలని తెలిపారు. పద్మావతి నగర్ వద్ద ఆక్రమణలపై స్థానికుల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిశీలించిన కమిషనర్, అనధికారంగా నిర్మించిన షెడ్డులను తొలగించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
Meenakshi Natarajan : మోడీ ప్రభుత్వం అదానీ, అంబానీ కోసమే పనిచేస్తుంది
బోరబండలోని సున్నం చెరువును పరిశీలించిన కమిషనర్.. అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులకు సంబంధించిన వివరాలను అధికారుల నుంచి తెలుసుకున్నారు. చెరువులో మురుగు నీరు ప్రవేశించకుండా చెరువు చుట్టూ drain లు ఏర్పాటు చేయాలని, పూర్తి స్థాయి అభివృద్ధి జరిగితే ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణం అందుతుందని అన్నారు. ఈ సందర్భంగా కమిషనర్‌ను కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ సన్మానించారు.
గచ్చిబౌలిలోని NGO కాలనీలో ఉన్న మూసాయికుంట, గోసాయికుంట చెరువులను పరిశీలించిన కమిషనర్, చెరువులను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు. చెరువుల చుట్టూ పారిశుద్ధ్య చర్యలు తీసుకోవడంతోపాటు నిత్య పరిశుభ్రతను కాపాడేలా చూడాలని సూచించారు.
వనస్థలిపురం పరిసరాల్లోని చింతలకుంట వద్ద జాతీయ రహదారి కింద నిర్మాణంలో ఉన్న అండర్గ్రౌండ్ డ్రైనేజీ పనులను పరిశీలించిన కమిషనర్, ఇప్పటికే 70 శాతం పనులు పూర్తయ్యాయని GHMC అధికారులు వివరించారు. వరద నిల్వ లేకుండా నీరు సమర్ధవంతంగా గమనించేలా పనులు పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు.
పడంగిపేట ప్రధాన రహదారిని దాటే నాలాను పరిశీలించిన రంగనాథ్, మీర్పేట పెద్ద చెరువుకు కలుపే ఈ కీలక నాలా విస్తరణ పనులను గతంలో ఆక్రమించిన ప్రాంతాన్ని తొలగించి ప్రారంభించామని చెప్పారు. 4 మీటర్ల వెడల్పుతోపాటు ఇరువైపులా 2 మీటర్ల బఫర్ జోన్ ఉండేలా నిర్మాణం చేపట్టాలని స్పష్టం చేశారు.
ఇప్పటికే పనుల్లో ఉన్న అభివృద్ధి ప్రాజెక్టులను సమీక్షిస్తూ, కొత్త ఆదేశాలు ఇచ్చిన కమిషనర్ రంగనాథ్ పర్యటనతో నగరంలో మురుగు నీటి సమస్యల పరిష్కారానికి గణనీయంగా దోహదపడనుందని అధికారులు పేర్కొన్నారు.
Anil Ravipudi: నా కెరీర్‌లో చేసిన విభిన్న ప్రయత్నం.. నేషనల్ అవార్డుపై స్పందించిన అనిల్ రావిపూడి!