CM Revanth Reddy : హైదరాబాద్ లోని హయత్ నగర్‌లో వీధి కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడిన మూగ బాలుడు ప్రేమ్ చంద్ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించారు. ఢిల్లీలో ఉన్న ఆయన ఉదయం పత్రికల్లో ఈ వార్త చూసి చలించిపోయారు. బాలుడి పరిస్థితి పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, వెంటనే సీఎంఓ అధికారులతో మాట్లాడారు.
గాయపడిన బాలుడికి మెరుగైన వైద్యం అందించాలని సీఎం ఆదేశించారు. అలాగే, బాలుడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, కుటుంబానికి అవసరమైన తక్షణ సాయం అందించాలని సూచించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు, కమిషనర్ స్వయంగా ఆసుపత్రికి వెళ్లి బాలుడిని పరామర్శించడంతో పాటు, కుటుంబాన్ని కూడా కలిసి వారి బాగోగులు పరిశీలించి, ప్రభుత్వ పరంగా అన్ని విధాలా ఆదుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
ఇదే సందర్భంలో, వీధి కుక్కల దాడులు, గతంలో జరిగిన సంఘటనలను దృష్టిలో పెట్టుకొని.. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ఉండేందుకు తక్షణం వీధి కుక్కల కట్టడిపై అధికారులు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.
Russia-Ukraine: రష్యా-ఉక్రెయిన్ శాంతిపై పుతిన్ 5 గంటలు చర్చలు.. చివరికి తేలిందిదే!