Tappachabutra incident: హైదరాబాద్‌లో పాత కక్షలు భగ్గుమన్నాయి. మంగళవారం అర్థరాత్రి ఆసీఫ్‌నగర్ టప్పాచబుత్రా ప్రాంతంలో ఓ వ్యక్తిని ప్రత్యర్థులు కాల్చి చంపడంతో సంచలనం నెలకొంది. పాత కక్షల కారణంగానే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు తెలిపారు.
కార్వాన్‌లోని షబాబ్ హోటల్ సమీపంలోని తోప్‌ఖానాలో క్రాంతి అతని సహచరుల బృందం అకా ఛోటు , 26 ఏళ్ల ఆకాష్ సింగ్‌పై హఠాత్తుగా పలుసార్లు కాల్పులు జరిపి అక్కడి నుంచి పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిని క్లూస్ టీమ్‌తో పాటు ఘటనాస్థలికి చేరుకున్నారు. ఘటనా స్థలంలో గన్ తో పాటు కత్తులు కూడా దొరికినట్లు తెలిపారు. మరణించిన వ్యక్తి బీజేపీ నేత అమర్ సింఘ్ అల్లుడు ఆకాష్ సింఘ్ గా పోలీసులు గుర్తించారు. గతంలో తప్పచబుత్ర పోలీస్ స్టేషన్ లో ప్రధాన నిందితుడు క్రాంతి సాగర్ పై ఫిర్యాదు చేసిన మృతుడు ఆకాష్ సింగ్ కేసు నమోదు చేసి క్రాంతి సాగర్ ను పోలీసులు బైండోవర్ చేశారు. దీంతో అర్థరాత్రి సెటిల్మెంట్ అని క్రాంతి సాగర్ స్కెచ్ వేశాడు. మంగళవారం రాత్రి, క్రాంతి ఆకాష్ సింగ్‌తో రాజీ కుదుర్చుకోవడానికి కార్వాన్‌లోని తోపేఖానా ప్రాంతానికి చెందిన ఇమ్రాన్ అనే స్నేహితుడిని సంప్రదించాడు.
Read also: Anti-India agenda: రామనవమి హింసపై ముస్లిం దేశాల కూటమి ప్రేలాపన.. తీవ్రంగా స్పందించిన భారత్..
అనంతరం ఆకాష్‌ను ఇమ్రాన్ తన నివాసానికి పిలిపించగా, క్రాంతి, అతని సహచరులు కూడా అక్కడికి చేరుకున్నారు. రాజీ సాకుతో, క్రాంతి అకస్మాత్తుగా ఆయుధాన్ని తీసి ఆకాష్ సింగ్‌పై పలు రౌండ్లు కాల్పులు జరిపాడు దీంతో ఆకాష్ సింగ్ అక్కడికక్కడే మరణించాడు. అనంతరం పోలీస్ స్టేషన్ లో ప్రధాన నిందితుడు క్రాంతి సాగర్ లొంగి పోయాడు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ కిరణ్ ఖరే తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా జనరల్ ఆస్పత్రి మార్చురీకి తరలించినట్లు తెలిపారు. మృతుడు ఆకాష్ సింగ్ ఒంటిపై ఛాతీ భాగంలో రెండు బులెట్స్, కుడి చేతి, వీపు భాగంలో పలు కత్తి పొట్లు ఉన్నాయని పోలీసులు తెలిపారు. క్రాంతి సాగర్ ఒక్కరే ఆకాష్ సింగ్ ను హతమార్చాడ లేదా ఇంకెవరెవరైనా ఉన్నార అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
Anti-India agenda: రామనవమి హింసపై ముస్లిం దేశాల కూటమి ప్రేలాపన.. తీవ్రంగా స్పందించిన భారత్..