RangaReddy:భార్య, అత్త, మామపై దాడి..ఆపై ఆత్మహత్యాయత్నం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మధ్యం మత్తులో భార్య, అత్త, మామపై దాడి చేసి ఆపై ఆత్మహత్య యత్నానికి పాల్పడిన ఘటన రాజేంద్రనగర్ పరిధిలో చోటుచేసుకుంది. భార్య భర్త ల వ్యవహారం చేయి చేసుకునేంత వరకు వెళ్ళింది. అత్తమామలు ప్రశ్నించడంతో ఆగ్రహంతో వారిపై కూడా దాడి చేశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధిలో మంజుల, కుమార్ నివాసం వుంటున్నారు. మద్యం సేవించిన కుమార్ భార్యతో గొడవకు దిగాడు. భార్య మంజుల పై అతికిరాతకంగా దాడి చేశాడు. ఇద్దరి మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఒక్కసారిగా భార్య మంజులా దేవిని భర్త కుమార్ చితకబాదడంతో భార్య మంజులకు తీవ్ర గాయాలయ్యాయి.
Also Read
దీంతో మంజులా తమ కుటుంబ సభ్యులకు భర్త దాడి గురించి తెలిపింది. అక్కడకు చేరుకున్న మంజుల తల్లిదండ్రులు తమ కూతురి ఎందుకు కొట్టవ్ అంటూ అల్లుడు కుమార్ ను ప్రశ్నించారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన కుమార్ నా ఇంటికే వచ్చి నన్నే ప్రశ్నిస్తారా అంటూ అత్త, మామ పై విచక్ఛనా రహితంగా దాడి చేశాడు. వారికి తీవ్ర గాయాలు కావడంతో భయంతో కుమార్ రెండవ అంతస్తు పై నుంచి కిందకు దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు.
కుమార్ కు తీవ్రగాయాలయ్యాయి. స్థానిక సమాచారంతో రాజేంద్రనగర్ పోలీసులు ఘటన స్థలికి చేరుకుని తీవ్ర గాయాలైన నలుగురిని ఆసుపత్రికి తరలించారు. కుమార్ పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
జయశంకర్ జిల్లాలోని భూపాలపల్లి రాంనగర్‌లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. పీకల్లోతు మద్యం మత్తులో భార్యపై భర్త రమేష్ దాడి చేశాడు. స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు రక్తపు మడుగులో ఉన్న భార్య రాజ్యలక్ష్మిని ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. అయితే పోలీసులు వచ్చేసరికే రమేష్ పరారయ్యాడు. కాగా.. రమేష్‌కు రాజ్యలక్ష్మి రమేష్‌కు రెండో భార్య. అయితే నిత్యం మద్యం సేవించి రాజ్యలక్ష్మిని రమేష్ వేధిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
B35 Bullet Train: 2030 నాటికి భారత్ 350KM వేగంతో బుల్లెట్ ట్రైన్.. జపాన్ E10 సిరీస్‌కు పోటీగా స్వదేశీ B35
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Saiyaara Jodi : మళ్లీ జోడీ కడుతున్న బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘సైయారా’ జోడి
-
Raaka Glimpse: డిసెంబర్లోనే అసలైన గ్లింప్స్.. రేపు అల్లు అర్జున్ ‘రాకా’ నుంచి వచ్చే సర్ప్రైజ్ ఇదేనా?
-
India Matches: 3 నెలలు, 28 మ్యాచ్‌లు.. టీమిండియా బిజీ షెడ్యూల్ మాములుగా లేదుగా..!
ట్రెండింగ్
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!