Raaka Glimpse: డిసెంబర్లోనే అసలైన గ్లింప్స్.. రేపు అల్లు అర్జున్ ‘రాకా’ నుంచి వచ్చే సర్ప్రైజ్ ఇదేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Raaka Glimpse: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా మూవీ ‘రాకా’ ప్రస్తుతం మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమా నుంచి ఇటీవల విడుదలైన ‘37’ నంబర్ పోస్టర్ అభిమానుల్లో కొత్త చర్చకు తెరతీసింది. 3×7=21 అంటూ ఫ్యాన్స్ లెక్కలు వేసుకుని సెప్టెంబర్ 21న అట్లీ బర్త్‌డే సందర్భంగా ఏదో భారీ సర్ప్రైజ్ రాబోతోందని ఊహించారు. దీంతో అసలు గ్లింప్స్ ఎప్పుడు వస్తుంది? సెప్టెంబర్ 21న మేకర్స్ ఏం చూపించబోతున్నారు? అనే చర్చ మరోసారి ఊపందుకుంది. అందుతున్న సమాచారం ప్రకారం ‘రాకా’ అసలైన ఫస్ట్ గ్లింప్స్ డిసెంబర్ 2026లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అంటే అల్లు అర్జున్ ఫుల్ యాక్షన్ అవతార్ గ్లింప్స్ కోసం అభిమానులు డిసెంబర్ వరకు వేచి చూడాల్సిందే. ‘37’ పోస్టర్‌కు మేకర్స్ ఎలాంటి వివరణ ఇవ్వకపోవడంతో సెప్టెంబర్ 21న గ్లింప్స్ వస్తుందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఆ తేదీకి సంబంధించిన అంచనాలు ఇప్పటివరకు ఫ్యాన్స్ లెక్కల వరకే పరిమితమయ్యాయి.
ఇప్పటికే సెప్టెంబర్ 18న ‘రాకా’ నుంచి సన్ పిక్చర్స్ ఒక చిన్న ప్రమోషనల్ వీడియోను విడుదల చేసింది. సినిమా కథ, పాత్రలు, విజువల్స్‌ను రివీల్ చేయకుండా కేవలం పవర్ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో ఈ వీడియోను రూపొందించారు. గెట్ రెడీ టు విట్నెస్ ఏ గ్లోబల్ ట్రయంఫ్ అనే క్యాప్షన్‌తో ఈ ప్రమోషనల్ వీడియో తర్వాత అట్లీ శిష్యుడు, దర్శకుడు సిబి చక్రవర్తి చేసిన వ్యాఖ్యలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి. అట్లీ తనకు చూపించిన ‘రాకా’ విజువల్స్ అద్భుతంగా ఉన్నాయని, తాను చూసిన ‘అవతార్’ విజువల్స్ కంటే కూడా అవి తనను ఆశ్చర్యపరిచాయని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. మరోవైపు సెప్టెంబర్ 21న అట్లీ పుట్టినరోజు కావడంతో ఆ రోజున సినిమా నుంచి ఏదైనా ప్రత్యేక ప్రమోషనల్ అప్డేట్ వచ్చే అవకాశం ఉందనే చర్చ కొనసాగుతోంది. మరోవైపు టెక్నికల్ టీమ్ వర్క్‌ను పరిచయం చేసే మేకింగ్ కంటెంట్ వస్తుందనే ప్రచారం కూడా వినిపిస్తోంది.
Also Read
అయితే సెప్టెంబర్ 21న కచ్చితంగా ఏ కంటెంట్ విడుదలవుతుందనే విషయంపై మేకర్స్ నుంచి క్లారిటీ అయితే రాలేదు. ఇక ‘రాకా’లో హాలీవుడ్ స్టార్ విల్ స్మిత్ పేరు కూడా చాలాకాలంగా వినిపిస్తోంది. సినిమాలో ఆయన కీలక పాత్రలో కనిపించబోతున్నారనే ప్రచారం ఉన్నప్పటికీ, సన్ పిక్చర్స్ ఇప్పటివరకు ఎలాంటి అనౌన్స్ చేయలేదు. మొత్తానికి ‘37’ పోస్టర్‌తో సెప్టెంబర్ 21పై అంచనాలు పెంచిన ‘రాకా’ టీమ్.. ఇప్పటికే ఒక చిన్న ప్రమోషనల్ వీడియోతో సినిమా స్కేల్‌పై హింట్ ఇచ్చింది. ఇప్పుడు అట్లీ బర్త్‌డే సందర్భంగా మరో ప్రత్యేక అప్డేట్ వస్తుందా లేదా అన్నదే ఆసక్తికరంగా మారింది. అయితే అల్లు అర్జున్ను పూర్తి యాక్షన్ అవతార్‌లో చూపించే అసలైన ఫస్ట్ గ్లింప్స్ మాత్రం డిసెంబర్లోనే రానుండటంతో అప్పటివరకు ఈ సినిమా చుట్టూ ఉన్న సస్పెన్స్ కొనసాగనుంది.
తాజావార్తలు
-
Harish Rao: కృష్ణా నీళ్ల లెక్కల్లో తేడాలేంటి? ఉత్తమ్‌కు హరీశ్ రావు కౌంటర్
-
AP MPTC, ZPTC Elections 2026: ఏకగ్రీవమైన స్థానాలెన్ని? బరిలో ఉన్న అభ్యర్థులెంతమంది?
-
Off The Record: కడప జడ్పీ పీఠంపై టీడీపీ–బీజేపీ ఫైట్.. పుత్తా వర్సెస్ ఆదినారాయణ రెడ్డి..!
-
Off The Record: ఆనం ఆగ్రహానికి అసలు కారణం ఇదేనా? ఆత్మకూరులో ఏం జరుగుతోంది?
-
OTR: అనంతపురమే ఎందుకు స్పెషల్? బీజేపీకి అసలు సవాల్!
ట్రెండింగ్
-
Viral Food : ఎగ్ టార్ట్పై బొద్దింకలాంటి పురుగు.. తినేందుకు ఎగబడుతున్న జనం.!
-
Dhanteras 2026: ధనత్రయోదశి 2026.. మీ రాశి ప్రకారం ఏ వస్తువు కొనాలి.?
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!