Etela Rajender : ధరణి పేరుతో పేద రైతులకు తీవ్ర అన్యాయం
- ధరణితో పేద రైతులు నష్టపోయారన్న ఈటల
- కాస్తు, అనుభవదారి కాలమ్స్ తొలగింపుపై అభ్యంతరం
- పాత భూ రికార్డులు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని వ్యాఖ్య
- భూ భారతి నేపథ్యంలో మళ్లీ తెరపైకి భూ హక్కుల అంశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ వల్ల పేద రైతులు తీవ్రంగా నష్టపోయారని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఆరోపించారు. ఎన్టీవీతో మాట్లాడిన ఆయన.. ధరణి పోర్టల్ తీసుకొచ్చిన సమయంలో భూ రికార్డుల నిర్వహణ మరింత సులభతరం అవుతుందని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కూడా ప్రయోజనం కలుగుతుందని ప్రభుత్వం చెప్పిందని గుర్తుచేశారు. అయితే ఆచరణలో మాత్రం అనేక మంది పేద రైతులు తమ భూములకు సంబంధించిన హక్కులు, రికార్డుల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆయన పేర్కొన్నారు.
ధరణి పోర్టల్‌లో భూమిపై ఎవరు హక్కుదారులో, ఎవరు ఆ భూమిని సాగు చేస్తున్నారో తెలియజేసే ‘కాస్తు’, ‘అనుభవదారి’ కాలమ్స్‌ను తొలగించడం వల్ల అసలైన సాగుదారులకు సమస్యలు ఏర్పడ్డాయని ఈటల రాజేందర్ అన్నారు. తరతరాలుగా ఒకే భూమిని సాగు చేసుకుంటున్న పేద రైతుల వద్ద సరైన సేల్ డీడ్లు లేకపోవడంతో ఇప్పుడు తమ హక్కులను నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన వివరించారు. రికార్డుల్లో మార్పులు రావడం, పాత వివరాలు అందుబాటులో లేకపోవడం వంటి కారణాలతో అనేక కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని ఆరోపించారు.
Also Read
- Telangana Real Estate: రియల్ ఎస్టేట్ సంస్థలకు తెలంగాణ రెరా షాక్.. భారీ జరిమానాలు..
- క్యాబ్ డ్రైవర్ ముసుగులో మిక్సింగ్ లిక్కర్ దందా.. ఇద్దరి అరెస్ట్.!
- Sammakka Sagar Barrage: సమ్మక్క సాగర్ బ్యారేజీకి త్వరలోనే ఎన్ఓసీ.. సీఎం రేవంత్‌కు ఛత్తీస్‌గఢ్ సీఎం హామీ..!
- Electric Shock: విద్యుత్ తీగ తగిలి విద్యార్థిని మృతి, మరో బాలికకు గాయాలు..!
దొరల వద్ద ఎట్టి చాకిరీ చేసిన కుటుంబాలు, వారి నుంచి తక్కువ ధరకు భూములను కొనుగోలు చేసి ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న వారు కూడా ఇప్పుడు సమస్యలను ఎదుర్కొంటున్నారని ఈటల తెలిపారు. తాము సాగు చేస్తున్న భూమిపై పూర్తి స్థాయి హక్కు ఉన్నప్పటికీ, దానికి సంబంధించిన పత్రాలు లేకపోవడం వల్ల పేద రైతులు తమ భూములను కాపాడుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. మరోవైపు దేవాలయ భూముల విషయంలోనూ అక్రమాలు జరిగాయని, కొందరు వాటిని కబ్జా చేశారని ఈటల ఆరోపించారు.
ధరణి విధానం అమల్లోకి వచ్చిన సమయంలోనే ప్రజలకు ఎదురయ్యే సమస్యలపై తాను ఆందోళన వ్యక్తం చేశానని ఈటల రాజేందర్ తెలిపారు. తాను మంత్రిగా ఉన్న సమయంలోనే ఈ విధానం వల్ల పేద రైతులకు నష్టం జరిగే అవకాశం ఉందని భావించానని చెప్పారు. భూమి అనేది పేద రైతులకు కేవలం ఆస్తి మాత్రమే కాదని, తరతరాలుగా వారి జీవనాధారంగా కొనసాగుతున్న భూమిపై రికార్డుల సమస్యలు తలెత్తితే వారి కుటుంబాలే తీవ్రంగా ప్రభావితమవుతాయని ఆయన పేర్కొన్నారు.
ధరణి పోర్టల్ స్థానంలో ప్రస్తుతం భూ భారతి వ్యవస్థ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో రాష్ట్రంలో భూ సమస్యలు మరోసారి చర్చకు వస్తున్నాయి. ధరణి కారణంగా ఏర్పడిన సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు ఇప్పటికే వెల్లడించింది. ఈ క్రమంలో పేద రైతుల భూ హక్కులు, పాత రెవెన్యూ రికార్డులు, సాగుదారుల వివరాలు వంటి అంశాలపై ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-4 Live : నాలుగో రోజు వేడుకలకు సిద్ధం.. కోటి దీపోత్సవంలో అమ్మవార్లకు విశేష పూజలు
-
Indian Railways: సొంతూళ్లకు వెళ్లేవారికి రైల్వే గుడ్‌న్యూస్.. క్రిస్మస్, సంక్రాంతికి 6 ప్రత్యేక రైళ్ల పొడిగింపు!
-
Telangana Real Estate: రియల్ ఎస్టేట్ సంస్థలకు తెలంగాణ రెరా షాక్.. భారీ జరిమానాలు..
-
IPL 2027 Retention List: వేలానికి సిద్ధమైన స్టార్లు.. కోట్లు పలికిన ఆటగాళ్లను వదులుకున్న ఫ్రాంచైజీలు.. లిస్ట్ ఇదే..
-
Viral Video: క్వాడ్ సమావేశంలో జాతీయ జెండాకు గౌరవం.. మోడీ చేసిన పని వైరల్..
-
Jimmy Tata: టాటా గ్రూప్‌లో అసలైన ట్విస్ట్.. రతన్ టాటా తమ్ముడి ఎంట్రీతో మారిన లెక్కలు!
ట్రెండింగ్
-
Clothes Washing Mistakes : ఉతికే ముందు ఈ పొరపాటు చేస్తున్నారా? రంగులు వెలిసిపోవడం ఖాయం!
-
IPL Retentions 2027: ఎంఎస్ ధోనీ ఎందుకు, వదిలేయండి.. సీఎస్కే మాజీ స్టార్ సంచలన కామెంట్స్!
-
Crispy Murmura Mixture: బయట కొనే చిరుతిళ్లకు చెక్.. ఇంట్లోనే కమ్మని కరకరలాడే ‘మరమరాల మిక్చర్’ సులువుగా చేసుకోండి ఇలా..!
-
Amla Pulihora Recipe: పుల్లపుల్లగా, కమ్మకమ్మగా నోరూరించే ‘ఉసిరికాయ పులిహోర’.. కేవలం నిమిషాల్లోనే రెడీ చేసుకోండి ఇలా..!
-
ఏడు అంగుళాల భారీ డిస్ప్లే, 13,300mAh బ్యాటరీతో HONOR కొత్త స్మార్ట్‌ఫోన్..!